Sunday, April 28, 2024

ఈ నెల 24న – ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్

ఈ నెల 29న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది ఆచార్య చిత్రం. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్నారు. కొర‌టాల శివ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. కాగా నిరంజ‌న్ రెడ్డి – రామ్ చ‌ర‌ణ్ క‌లిసి ఈ సినిమాని భారీ బ‌డ్జెట్ తో నిర్మించారు. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టిస్తోంది. చ‌ర‌ణ్ ముఖ్య పాత్ర‌ని పోషిస్తుండ‌గా ఆయ‌న స‌ర‌స‌న పూజాహెగ్డే హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ సినిమాలో అవినీతిపరుల ఆటకట్టించడం కోసం పోరాటం చేసే వీరులుగా చిరంజీవి – చరణ్ కనిపించనున్నారు.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించిన ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 24వ తేదీన జరపనున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ .. యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో ఈ వేడుకను ప్లాన్ చేస్తున్నట్టుగా స‌మాచారం.
దాదాపు ఈ తేదీ ఖరారైపోయిందనీ, త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని అంటున్నారు. మణిశర్మ నుంచి బయటికి వచ్చిన పాటలు ఇప్పటికే పాప్యులర్ అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement