Tuesday, April 30, 2024

Big Breaking: భారత్ లోకి కొత్తగా ఒమిక్రాన్ BF-7 వేరియంట్

ఎయిర్ పోర్టుల్లో కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది. భారత్ లో ఒమిక్రాన్ BF-7 వేరియంట్ ఎంట్రీ ఇచ్చింది. చైనాలో కరోనా వ్యాప్తికి BF-7 వేరియంట్ కారణమైంది. గుజరాత్ లోని వడోదరలో ఎన్ఆర్ఐ మహిళకు BF-7 వేరియంట్ వచ్చింది. దీంతో కేంద్రం ఎయిర్ పోర్టుల్లో హై అలర్ట్ ప్రకటించింది.

ప్రస్తుతం చైనాలో కోవిడ్-19 విజృంభణకు కారణమైన ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ BF.7 కేసులు మూడు నమోదయ్యయాని అధికార వర్గాలు బుధవారం వెల్లడించాయి. బీఎఫ్.7 మొదటి కేసును గుజరాత్ బయోటెక్నాలజీ రిసెర్చ్ సెంటర్ అక్టోబరులో గుర్తించినట్టు తెలిపాయి. రెండో కేసు కూడా గుజరాత్‌లోనే నమోదయ్యిందని, మూడోది ఒడిశాలో గుర్తించినట్టు పేర్కొన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement