Friday, March 29, 2024

వైర‌ల్ అవుతోన్న‌.. #NTRForOscars #RRRForOscars అనే హ్యాష్ ట్యాగ్స్

ఇప్ప‌టికే భారీ స్థాయిలో లాబీయింగ్ కోసం ఖ‌ర్చు చేసి ఓ రేంజ్ లో ఆర్ ఆర్ ఆర్ ని ప్ర‌మోట్ చేసిన ద‌ర్శ‌కుడు రాజమౌళి ప్రస్తుతం ఆస్కార్ నామినేషన్స్ కోసం అసక్తిగా ఎదురు చూస్తున్నాడు. హాలీవుడ్ కు చెందిన పలువురు దర్శకులు టెక్నీషియన్ లు స్టార్స్ ‘RRR’ ఆస్కార్ కు నామినేట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్న వేళ.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ నెట్టింట ఎన్టీఆర్ హ్యాష్ ట్యాగ్ తో జోరుగా ప్రచారం చేస్తుండటం వైరల్ గా మారింది.

ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ పై దేశ వ్యాప్తంగా తీవ్ర ఉంత్కంఠం నెలకొన్న నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులు #NTRForOscars #RRRForOscars అనే హ్యాష్ ట్యాగ్ ల తో నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ‘RRR’ ఆస్కార్ బరిలో నిలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఆస్కార్ అవార్డ్ రావడం పక్కా అంటూ అందులోనూ తనకు బెస్ట్ యాక్టర్ గా అవార్డ్ వస్తుందని వరుస ట్వీట్ లు చేస్తున్నారు. దీంతో #NTRForOscars అనే హ్యాష్ ట్యాగ్ నెట్టింట ట్రెండ్ గా మారి వైరల్ అవుతోంది. మరి ఫ్యాన్స్ ఊహించినట్టే RRR ఆస్కార్ బరిలో నిలుస్తుందా .. ఎన్టీఆర్ కు బెస్ట్ యాక్టర్ అవార్డుని తెచ్చిపెడుతుందా? అన్నది వేచి చూడాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement