Sunday, April 28, 2024

ఏడెకరాల్లో ఆయిల్ పామ్.. తోటల సాగుపై రైతుల ఆసక్తి..

ప్రభన్యూస్ : ఆయిల్ ఫామ్ తోటలసాగుపై చిట్యాల మండల రైతులు ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు. తక్కువ పెట్టుబడితో సుదీర్ఘకాలం పాటు సిరులు కురిపించనుండడంతో ఉద్యానశాఖ అధికారులు దృష్టి సారించారు. జయశంకర్ జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగుకు అనువైన స్థలాలు గుర్తించి సాగుకు సిద్ధంచేస్తున్నారు. మండలంలో సుమారు నాలుగు వేల ఎకరాల్లో సాగు చేయనున్నారు. ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగుచేసిన ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం, అశ్వరావుపేట అప్పారావుపేట మండలాల్లో గల తోటలకు మన జిల్లాలో రైతు లను తీసుకెళ్లి సాగుపై అవగాహన కల్పిస్తున్నారు. దీంతో సాగుబడి కోసం రైతులు దరఖాస్తు చేసుకుంటున్నారు. సబ్సిడీ పై మొక్కలు ఉద్యానవన శాఖ అందిస్తుంది. రైతులకు 50 శాతం సబ్సిడీ ఉద్యానవనం శాఖ అందిస్తుంది, దానికి అనుసంధానంగా డ్రిప్పుకు ఎస్ టిలకు 100 శాతం, బీసీల కు90 శాతం, ఓసీలకు 80 శాతం, జిఎస్టి సబ్సిడీగా అందించనున్నారు. పంట వేసిన నాటి నుంచి 4 సంవత్సరాలు పంటలకు 50 శాతం పంటల కోత, కూలీల, ఖర్చుగెలల రవాణా ఖర్చు అందించనున్నారు. అతివృష్టి, అనావృష్టి, వలన తుఫాను వచ్చినా ఆయిల్ పంటలకు నష్టం ఉండదు కోతులు ఇతర పక్షుల బెడద ఉండదు పర్యావరణ పర్యావరణాన్ని కాపాడి సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయ న్నారు.

ఏడెకరాల్లో సాగు చేశా.. చిట్యాల జెడ్ పి.టి.సి గొర్రె సాగర్..

మండలంలోని నైన్ పాక శివారులో గల తన వ్యవసాయ పంట పొలంలో గతంలో వరి, పత్తి పంట వేశానని, ఆశించిన దిగుబడి, లాభం రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ ఫామ్ తోటల పెంపకం కోసం సబ్సిడీ ఇవ్వడంతో పాటు సాగుతో అధిక లాభాలు వస్తాయని గత నెల క్రితం ఆయిల్ పామ్ మొక్కలు నాటి నట్లు తెలిపారు. నాలుగు సంవత్సరాల లో పంట వస్తుందని 30 సంవత్సరాల వరకు పంట దిగుబడి వచ్చి లాభాల బాటలో రైతులు ఎదుగుతారని ఆయన అన్నారు . మండలంలోని రైతులు తమ పంట పొలాల్లో ఆయిల్ ఫామ్ తోటలు వేసుకోవాలని సాగర్ కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement