Wednesday, April 17, 2024

YSRTP @షర్మిల పార్టీకి గుర్తింపు లేదు

తెలంగాణ పార్టీ కూడా తమ పార్టీ పేరును పోలి ఉందంటూ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం తెలుపుతూ భారత ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం షర్మిల పార్టీ రిజిస్ట్రేషన్ నిలుపుదల చేసినట్లు వెల్లడించింది. వైయస్ షర్మిలకు మరికొన్ని ఇతర పేర్లు సూచించాలని ఈనెల 3వ తేదీన లేఖ రాసినట్లు ఎన్నికల సంఘం మహబూబ్ బాషా కు వ్రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలిపింది. దీంతో వైయస్ షర్మిల అభిమానులు షాక్ కు గురయ్యారు.

ఇప్పటికే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో షర్మిల కార్యక్రమాలను సైతం మొదలుపెట్టారు. కాగా భారత ఎన్నికల సంఘం పంపిన లేఖతో వైఎస్ షర్మిల అభిమానులు నిరాశకు గురవుతున్నారు. షర్మిలకు వైయస్సార్ పేరుతోనే పార్టీ కావాలంటే మహబూబ్ బాషాతో రాజీ కావడం తప్ప ఇతర మార్గం కనిపించడం లేదు. లేకపోతే వైఎస్ఆర్ పేరు లేకుండా వేరే పేరు పెట్టుకోవడం ఆమెకు ప్రత్యామ్నాయంగా మిగిలింది. కాగా 2 తెలుగు రాష్ట్రాల్లో వైయస్సార్ పేరుతో భారత ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయిన ఏకైక పార్టీ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని మహబూబ్బాషా, అబ్దుల్ సత్తార్ వెల్లడించారు. నిజమైన వైఎస్ఆర్ అభిమానుల పార్టీ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని వారు స్పష్టం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement