Monday, April 29, 2024

రానున్న‌ది కార్తీక‌మాసం..అన్నీ పండ‌గ‌లే..

వినాయ‌క చ‌వితి పండుగ పూర్త‌యిన ద‌గ్గ‌రనుంచి సంక్రాంతి వెళ్ళే వ‌ర‌కు తెలుగువారికి పండుగ‌లే పండుగ‌లు. మ‌రి వ‌చ్చే నెల అంటే న‌వంబ‌ర్ లో ఏయే పండుగ‌లు రానున్నాయో తెలుసుకుందాం..నవంబ‌ర్ మాస‌మంతా పుణ్య‌మాస‌మ‌నే చెప్పాలి..ఎందుకంటే ఈ నెల‌లోనే శివునికి ప్రీతిక‌ర‌మైన కార్తీక మాసం ప్రారంభం అవుతుంది. అయ్య‌ప్ప‌మాల‌ల‌ను విరి విగా ధ‌రిస్తుంటారు అయ్య‌ప్ప భ‌క్తులు. ఈ నెల అంతా శుభ‌క‌ర‌మ‌ని చెబుతుంటారు పెద్ద‌లు. మ‌రి ఈ నెల‌లో ముందుగా దీపావళి పండుగ రానుంది. ఆ త‌ర్వాత అన్నాచెల్లెళ్ల పండగ రాఖీ కూడా ఈ నెల‌లోనే వ‌స్తుంది. ఆ త‌ర్వాత పుట్ట‌లో పాలు పోయ‌డం అంటే నాగుల చవితి వంటి అనేక పండగలు వస్తాయి.

కార్తీక మాసంలో క్రిష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని రామ ఏకాదశి అంటారు. నవంబర్ 1న రామ ఏకాదశి వచ్చింది. ఈ పవిత్రమైన రోజు శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. చాతుర్మాస కాలం ముగుస్తుంది. నవంబర్ 14న దేవుని ఏకాదశి, నవంబర్ 30న ఉత్పన్న ఏకాదశిని జరుపుకోనున్నారు.నవంబర్ రెండో తేదీన ధన త్రయోదశి వచ్చింది. దీన్నే దంతేరాస్ అని కూడా అంటారు. ఈ పవిత్రమైన రోజున ధన్వంతరి మరియు కుభేరులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. క్షీరసాగర మథనం సమయంలో ఈరోజున లక్ష్మీదేవి జన్మించిందని పురాణాల కథనం.నవంబర్ మూడో తేదీ..నరక చతుర్దశి. క్రిష్ణ పక్షంలో చతుర్దశి రోజున నరక చతుర్దశిగా జరుపుకుంటారు. ఇది దీపావళికి ముందు రోజున వస్తుంది.

ఇక నవంబర్ 4వ తేదీన గురువారం నాడు దీపావళిను జరునుకుంటారు. కార్తీక మాసంలో దీపావళికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ రోజున భక్తులు లక్ష్మీ పూజను నిర్వహిస్తారు. నవంబర్ 5 ఈ రోజున ఇంద్ర దేవుడిపై శ్రీకృష్ణుడు సాధించిన విజయానికి గుర్తుగా గోవర్ధన్ పూజను భక్తులు జరుపుకుంటారు.నవంబర్ 6న భాయ్ దూజ్ పండుగను జరుపుకుంటారు. ఇది రక్షా బంధన్ వంటి పండగ. అన్న చెల్లలు జరుపుకునే పండగ. సోదరీమణులు తమ సోదరుల శ్రేయస్సు కోసం వారి నుదిటిపై తిలకం పెట్టుకుని ప్రార్థిస్తారు. ఈ పండుగను ఉత్తర భారత దేశంలో ఎక్కువగా జరుపుకుంటారు.

కాగా నవంబర్ 15న భక్తులు పవిత్రమైన తులసి మొక్క యొక్క వివాహ వేడుకను నిర్వహిస్తారు. ఈ తులసి వివాహం తర్వాత, భారతదేశంలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమవుతుంది.నవంబర్ 19న, కార్తీక పౌర్ణమి.. హిందూ సంప్రదాయంలో కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. గురునానక్ దేవ్ జీ కూడా ఈ రోజే.నవంబర్ 30 తేదీన ఉత్పన్న ఏకాదశి వచ్చింది. హిందూ క్యాలెండర్ ప్రకారం మార్గశిర మాసంలో శుక్ల పక్షంలో ఏకాదశి తిథి నాడు ఏకాదశి వస్తుంది. ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. మ‌రి వ‌చ్చే నెల మొత్తం చ‌న్నీటి స్నానాలు..దీపారాధ‌న‌ల‌తో హిందువులంతా ప‌లు పూజ‌ల‌లో నిమ‌గ్న‌మై ఉంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement