Sunday, May 5, 2024

Spl Story: ఏయ్, నిద్రపోతున్నావా, దొంగ!.. అర్ధరాత్రి వేళ మహిళలకు ఆ మెస్సేజులు!

‘‘ఏయ్​.. నిద్రపోతున్నావా.. దొంగ, కావాలనే నటిస్తున్నావు కదా!.. ఎందుకో ఇవ్వాల  నువ్వు చాలా అందంగా ఉన్నావు. నిన్ను చూస్తుంటే అదోలా ఉంది. నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేశావు. రేపు ఒసారి కలుస్తావా? నేనొవరో తెలుసుకునే  ఇంటెలిజెంట్ నీకు ఉంది” ఇదో వాట్సాప్​ మెస్సేజ్​.. ఓ మహిళకు రాత్రి వేళ మెస్సేజ్​ వచ్చింది.. ఇదే వాట్సాప్​ మెస్సేజ్​ మళ్లీ మళ్లీ ఆ మహిళకు పదే పదే వస్తూనే ఉంది. తెలియని నెంబర్​ నుంచి రావడంతో తొలుత ఆ విషయాన్ని ఆమె పెద్దగా పట్టించుకోలేదు. కానీ, రోజూ రాత్రి 11.30 ప్రాంతంలో మళ్లీ మళ్లీ అదే మెస్సేజ్​ వస్తుండడంతో కావాలనే ఎవరో తనను ఆటపట్టిస్తున్నారని, వేధిస్తున్నారని గుర్తించింది. ఇక ఈ విషయమేంటో తేల్చుకోవాలని పోలీసులకు కంప్లెయింట్​ ఇచ్చింది. ముంబైలో జరిగిన ఈ ఘటన కోర్టుదాకా వెళ్లింది. చివరికి తీర్పు ఏం వచ్చిందో చదివి తెలుసుకుందాం!

– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

ముంబై కార్పొరేషన్​లో మహిళా కార్పొరేటర్​గా ఉన్న ఓ మహిళకు అర్ధరాత్రి వేళ ‘‘ఏయ్​.. నువ్వ నిద్రపోతున్నావా, నీకు పెళ్లయ్యిందా లేదా.. నువ్వు చాలా అందంగా ఉంటావు, అంతే తెలివిన దానివి. నాకైతే నచ్చేశావు. రేపు కలుస్తావా? అంటూ రిపీటెడ్​గా ఓ వాట్సాప్​ మెస్సేజ్​ వస్తోంది. పోలీసులకు కంప్లెయింట్​ చేయడంతో కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వ్యక్తి ముంబై కార్పొరేషన్​లో పనిచేసే ఓ ఉద్యోగిగా గర్తించి జైలుకు పంపారు. అయితే ఈ కేసు ముంబై కోర్టులో విచారణకు వచ్చింది.

ప్రాసిక్యూషన్ ప్రకారం..కార్పొరేటర్‌గా ఉన్న శివసేన నేతల భార్యలకు ఇట్లాంటి అసభ్యకరమైన మెస్సేజులు పంపినందుకు 43 ఏళ్ల BMC అధికారిని ముంబైలోని మేజిస్ట్రేట్ కోర్టు దోషిగా నిర్ధారించి మూడు నెలల సాధారణ జైలు శిక్ష విధించింది. నిందితుడు మహిళను “గుడియా” అని తన మెస్సేజుల్లో పేర్కొన్నట్టు కోర్టు పరిశీలనకు వచ్చింది.  “మహిళ,  నిందితుడి మధ్య ఎట్లాంటి ఫ్రెండ్​షిప్​ లేదు. నిందితుడు ఆ మహిళకు అస్సలు తెలియదు. ఆమె వివాహిత. ఈ మెసేజ్‌లు రాత్రి 11.30 నుంచి 12.30 గంటల మధ్య వస్తున్నాయి. అయితే.. ఏ వ్యక్తి గోప్యత (ప్రైవసీకి) కు భంగం కలిగించే సందేశాలను పంపే హక్కు ఎవరికీ లేదని కోర్టు స్పష్టం చేసింది.

నిందితుడైన నర్సింగ్ గుడేపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 67 (ఎలక్ట్రానిక్ రూపంలో అశ్లీల విషయాలను ప్రచురించడం లేదా ప్రసారం చేయడం), భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 509 (పదం, సంజ్ఞ లేదా చర్య) కింద నమోదు చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం యొక్క A (లైంగిక అసభ్యకరమైన చర్యను కలిగి ఉన్న విషయాన్ని ప్రచురించడం లేదా ప్రసారం చేయడం) వంటి కేసులను నమోదు చేశారు.

- Advertisement -

ప్రాసిక్యూషన్ ప్రకారం..  మహిళ తన వాట్సాప్​కి తెలియని మొబైల్ నంబర్ నుండి రాత్రి 11.30 గంటల సమయంలో 20 నుండి 25 మెస్సేజులు వస్తున్నట్టు గమనించింది. “నువ్వు నిద్రపోతున్నావా, నీకు పెళ్ళయిందా లేదా, నువ్వు తెలివిగా కనిపిస్తున్నావు, చాలా అందంగా ఉన్నావు, నాకు నువ్వు నచ్చావు, నా వయసు 40 ఏళ్లు, రేపు కలుస్తావు” వంటి టెక్స్ట్ లు ఆమె ఫోన్​లో కనిపించాయి.  తెలియని నంబర్ నుండి కొన్ని అశ్లీల ఫొటోలు  కూడా వచ్చినట్టు ప్రాసిక్యూషన్ తెలిపింది. ఆ తెలియని నంబర్‌ వివరాలను తన భర్తకు అందివ్వగా కాల్​ చేస్తే ఎవరూ తీయలేదు. కానీ వెంటనే, ఆ నంబర్ నుండి కొన్ని మెస్సేజులు అందాయి, “సారీ నేను రాత్రి కాల్‌ని లిఫ్ట్​ చేయలేకపోయాను. ఏమిటి సంగతులు? నాకు చాటింగ్ అంటే ఇష్టం, ఆన్‌లైన్‌కి రండి. అంటూ మెస్సేజులు వచ్చాయి.

దీంతో ఆ మహిళ దహిసర్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసినప్పుడు నిందితుడు తనకేమీ తెలియదని చెప్పుకొచ్చాడు. అయితే.. మహిళ ప్రస్తుతం కార్పొరేటర్​ కాగా, ఆమె భర్త మాజీ కార్పొరేటర్.. ఇక  నిందితుడు BMC అధికారిగా పోలీసులు తెలిపారు.

డిఫెన్స్ ప్రకారం.. దంపతులకు, అధికారికి మధ్య వ్యక్తిగత శత్రుత్వం ఉంది కాబట్టే  వ్యక్తిగత కక్షతోనే కేసు పెట్టారని వాదనలు వినిపించారు. అయితే ఆ వాదనను మేజిస్ట్రేట్ వీజే కోర్ అంగీకరించలేదు. మహిళ మొబైల్ నంబర్‌కు పంపిన ఫొటోలు ఇప్పటికే ఒక వార్తాపత్రికలో ప్రచురితమయ్యాయని, అది అప్పట్లో వైరల్ అయ్యిందని కూడా వాదించారు. అయితే మేజిస్ట్రేట్ “అశ్లీల భావన వ్యక్తి నుండి వ్యక్తికి మారుతుంది. మరొక వ్యక్తికి ఎటువంటి ఫోటోగ్రాఫ్‌లు  పంపే అధికారం ఎవరికీ లేదు” అన్నారు.

“ఫోటోగ్రాఫ్‌లు లేదా ఫొటోలు వార్తాపత్రికలో వచ్చినప్పటికీ దానిని వైరల్ చేసే లేదా మరొక వ్యక్తికి పంపే హక్కు ఎవరికీ లేదు. ఇన్‌ఫార్మర్ నంబర్‌కు పంపబడిన ఫోటోగ్రాఫ్‌లలో, మోడల్ తక్కువ బట్టలు ధరించింది. దేశంలో చాలా కుటుంబాలలో సాంప్రదాయ దుస్తులను ఆచరిస్తారు. అందువల్ల, అలాంటి కుటుంబాలకు తక్కువ దుస్తులు అశ్లీలంగా ఉంటాయి.  అంతేకాకుండా  నిందితుడు మహిళకు తెలియనప్పుడు ఇట్లాంటి అశ్లీల ఫొటోలు ఎందుకు పంపించారు. మెస్సేజులు, ఫొటోలను పరిశీలిస్తే మహిళను కించపరిచే ఉద్దేశ్యంతో  వాటిని పంపినట్టు తెలుస్తోంది అని మేజిస్ట్రేట్ కోర్ తన తీర్పులో పేర్కొన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement