Wednesday, May 8, 2024

ఆందోళన వద్దు.. పార్టీ అండగా వుంటుంది : కవితకు కేసీఆర్ భరోసా

బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తన కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు ఫోన్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఈడీ నోటీసుల నేపథ్యంలో కవిత ఢిల్లీకి బయల్దేరారు. ఈ సందర్భంగా ఆమెకు కేసీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు. న్యాయపరంగా బీజేపీ అకృత్యాలపై పోరాడదామని సీఎం ధైర్యం చెప్పారు. నీ కార్యక్రమాలు కొనసాగించాలని.. ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ అండగా వుంటుందని కేసీఆర్ పేర్కొన్నారు.

ఇదిలా వుండగా.. కవిత బుధవారం తన నివాసం నుంచి ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. తన నివాసం నుండి ప్రగతి భన్ కు వెళ్తారని భావించారు. కానీ కవిత ప్రగతి భవన్ కు వెళ్లకుండా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బయల్దేరారు. నిర్ణీత షెడ్యూల్ మేరకు ఈరోజు సాయంత్రం కవిత ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. అయితే ఈడీ నుండి స్పందన కోసం ఇవాళ సాయంత్రం వరకు కవిత ఎదురు చూశారు. కానీ ఈడీ నుండి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో తన నిర్ణీత షెడ్యూల్ మేరకు కార్యక్రమాలను కొనసాగించాలని కవిత నిర్ణయం తీసుకున్నారు. ఎల్లుండి ధర్నాలో పాల్గొనేందుకు వీలుగా, అక్కడి ఏర్పాట్లను సమీక్షించేందుకు కవిత ఢిల్లీకి వెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement