Wednesday, May 15, 2024

మంత్రి పదవి ఉన్నా లేకపోయినా.. పార్టీ కోసం కృషి చేస్తాం – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

నాకు మంత్రి పదవి పై ఎలాంటి సమాచారం అందలేదని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి అన్నారు. మంత్రి పదవి ఉన్నా.. లేకపోయినా అందరం కలిసి పనిచేయాలని గత క్యాబినెట్ లో సిఎం జ‌గ‌న్ చెప్పార‌న్నారు. గత క్యాబినెట్ లో వాళ్ళు ఉంటారని నేనూ మీడియాలోనే చూశాను..10 మంది పాతవారు ఉంటారని మీడియాలో వస్తుంది..ఆ పది మందిలో నేను ఉన్నా.. లేకున్నా సంతోషమే..మంత్రి పదవి ఉన్నా లేకపోయినా పార్టీ కోసం కృషి చేస్తాం..జగన్ మోహన్ రెడ్డి నిరంతరం కష్టపడే వ్యక్తి..ఆయనకు అండదండగా ఉండాల్సిన బాధ్యతా మా అందరిపై ఉంది..తప్పకుండా సిఎం కోసం పని చేస్తామ‌న్నారు పెద్దిరెడ్డి.

Advertisement

తాజా వార్తలు

Advertisement