Thursday, May 2, 2024

స్పై క‌థ విని నో చెబుదామ‌ని అనుకున్నా….

నిఖిల్‌ సిద్ధార్థ్‌ రా ఏజెంట్‌గా నటిస్తున్న చిత్రం ‘స్పై’. గ్యారీ బిహెచ్‌ దర్శకుడు. కె రాజశేఖర్‌ రెడ్డి, సిఇఓగా చరణ్‌ తేజ్‌ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. సుభాష్‌ చంద్రబోస్‌ సీక్రెట్‌ప ఈ చిత్రం ఉంటు-ందని ముందే చెప్పారు. అందుకే నిన్న న్యూఢిల్లీ లోని సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహం కర్తవ్య పథ్‌ వద్ద ‘స్పై’ టీ-జర్‌ విడుదల చేసిన తర్వాత హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో చిత్ర బృందం పాల్గొంది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు, ఎడిటర్‌ గ్యారీ బిహెచ్‌. మాట్లాడుతూ, ”ఈ సినిమాకు తొలుత నన్ను ఎడిటర్‌గా తీసుకున్నారు. ఆ తర్వాత నువ్వే డైరెక్టర్‌ అన్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌ సబ్జెక్ట్‌ కోసం నా ఫ్రెండ్‌ తో కలిసి టీ-మ్‌ గా ఏర్పడి చేసిన సినిమా స్పై. నిఖిల్‌ లేకపోతే నేను లేను. జూన్‌ 29న సినిమాతో మీ ముందుకు రాబోతున్నాం.” అన్నారు.

హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌ మాట్లాడుతూ, ” ఎన్ని విజయాలు వచ్చినా ప్రతి సినిమా కొత్త ప్రయత్నమే. స్పై మూవీ కి హీరో కథనే. మొదట కథ విని నో చెబుదాం అనుకున్నా. కానీ ఆయన చెప్పిన విధానం చూసి చేసేద్దాం అనిపించింది. ఈ కథ ఏమిటనేది తెలిసిందే. సుభాష్‌చంద్రబోస్‌ గారి గురించి చాలా విషయాలు మనకు తెలియవు. ఆయన స్థాపించిన ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ దాని పనులు చాలామందికి తెలీవు. ఎంటర్‌ -టె-న్‌ మెంట్‌ తోపాటు- దేశానికి తెలియాల్సిన పాయింట్‌ ఇందులో వుంది. నేతాజీగారి సీక్రెట్స్‌ ఈ కథ.” అని అన్నారు.
నిర్మాత చరణ్‌తేజ్‌ ఉప్పలపాటి మాట్లాడుతూ,” జూన్‌ 29న సినిమా చూసి థ్రిల్‌ అవుతారని చెప్పగలను. -టె-క్నీషియన్స్‌ అందరూ కష్టపడి పనిచేశారు” అని తెలిపారు. ఇంకా ఈ సమావేశంలో సంగీత దర్శకుడు శ్రీచరణ్‌ పాకాల, మరో సంగీత దర్శకుడు విశాల్‌ చంద్రశేఖర్‌, సినిమాటోగ్రాఫర్‌ వంశీ పచ్చిపులుసు, ఫైట్‌ మాస్టర్‌ బాబీ, రో ఫైట్‌ మాస్టర్‌ రాబిన్‌ సుబ్బు, అఖండ ఫేమ్‌ నితిన్‌ మెహతా, టి సాన్య ఠాకూర్‌, ఐశ్వర్య మీనన్‌, మాటల రచయిత అనిరుధ్‌ కృష్ణమూర్తి సినిమా గురించి మాట్లాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement