Sunday, April 28, 2024

న్యూజిలాండ్ లో ఎంపీగా ఏపీ యువ‌తి – గ‌డ్డం మేఘ‌న‌కి అరుదైన గౌర‌వం

న్యూజిలాండ్ లో ఎంపీగా ఏపీ యువ‌తి ఎంపిక అవ్వ‌డం విశేషం. దాంతో తెలుగు యువ‌తికి అరుదైన గౌర‌వం ద‌క్కింది. గ‌డ్డం మేఘ‌న ఏపీలోని ప్ర‌కాశం జిల్లా టంగుటూరుకు చెందిన యువ‌తి. న్యూజిలాండ్ దేశ యూత్ పార్ల‌మెంట్ స‌భ్యురాలిగా ఎంపిక కావ‌డం తెలుగువారికి గ‌ర్వ‌కార‌ణం. కాగా రీసెంట్ గా ఆ దేశ నామినేటెడ్‌ ఎంపీ పదవుల ఎంపిక జరిగింది. దీనిలో భాగంగా సేవా కార్యక్రమాలు, యువత విభాగానికి ప్రాతినిధ్యం వహించే పార్లమెంట్‌ సభ్యురాలిగా మేఘన ఎన్నికయ్యారు. వాల్కటో ప్రాంతం నుంచి ఆమె ఈ నామినేటెడ్‌ పదవీకి ఎంపికయ్యారు. మేఘన తల్లిదండ్రులు న్యూజిలాండ్‌ లోనే స్థిరపడ్డారు. ఆమె తండ్రి గడ్డం రవికుమార్‌ ఉద్యోగ రీత్యా 2001 లో న్యూజిలాండ్‌ వెళ్లారు. అలా 21 ఏళ్ల క్రితం భార్య ఉషాతో కలిసి న్యూజిలాండ్‌ వెళ్లిన రవి కుమార్‌ అక్కడే సెటిల్‌ అయ్యాడు. ఇక అక్కడే పుట్టి పెరిగిన మేఘన.. కేంబ్రిడ్జిలోని సెయింట్‌ పీటర్స్‌ హై స్కూల్‌ లో పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేసింది. అయితే ఈ యువ‌తి వ‌య‌సు 18ఏళ్ళు మాత్ర‌మే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement