Monday, April 29, 2024

NEET UG, PG కౌన్సెలింగ్.. జనవరిలో ఉండే చాన్స్..

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) అండర్ గ్రాడ్యుయేట్ (UG), పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) కౌన్సెలింగ్ 2022 జనవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఏఐక్యూ మెడికల్ సీట్లలో ఓబీసీకి 27 శాతం, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్‌కి 10 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన అంశం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని, దీనిపై విచారణ జరగనుందని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) పేర్కొంది. వచ్చే ఏడాది జనవరి 6న, కేసుపై కోర్టు తీర్పు తర్వాత UG, PG అడ్మిషన్ కోసం NEET కౌన్సెలింగ్ 2021 ప్రారంభం కానున్న‌ట్టు తెలుస్తోంది.

NEET PG , NEET UG కౌన్సెలింగ్‌లో కూడా కౌన్సెలింగ్ కమిటీ కొన్ని మార్పులు చేసింది. ఈ మార్పులు 2021-22 విద్యా సంవత్సరం నుంచి అమలులోకి వస్తాయని MCC చెబుతోంది. వీటిలో నాలుగు రౌండ్లలో కౌన్సెలింగ్ నిర్వహించడం, సీట్ల అప్‌గ్రేడేషన్ ప్రక్రియలో మార్పులు వంటివి ఉన్నాయి.

మెడికల్ ఆస్పిరెంట్స్ 15శాతం ఆల్ ఇండియా కోటా (AIQ) సీట్ల కోసం mcc.nic.inలో, ఆయుష్ కోర్సులలో ప్రవేశానికి aaccc.gov.inలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ (BHMS), బ్యాచిలర్ ఇన్ యునాని మెడిసిన్ అండ్ సర్జరీ (BUMS), బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదం, మెడిసిన్ అండ్ సర్జరీ (BAMS), బ్యాచిలర్ ఆఫ్ సిద్ధ మెడిసిన్ అండ్ సర్జరీ (BSMS). AACCC నీట్ కౌన్సెలింగ్ ఆయుష్ కోర్సులను నిర్వహిస్తోంది.

సెంట్రల్ పూల్ పరిధిలోకి వచ్చే అన్ని మెడికల్ సీట్లకు 27శాతం ఓబీసీ, 10శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పొడిగిస్తూ జులైలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై కొంత‌మంది సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి వార్షిక ఆదాయ ప్రమాణాలుగా రూ.8 లక్షలు నిర్ణయించడం వెనుక ఉన్న హేతుబద్ధతను సుప్రీంకోర్టు గతంలో జరిపిన విచారణలో ప్రశ్నించి కేంద్రం నుంచి సమాధానాన్ని కోరింది.

NEET కౌన్సెలింగ్ 2021కు ఇవి మస్ట్..
అభ్యర్థులు రిజిస్ట్రేషన్ సమయంలో వీటితో సహా కొన్ని వ్యక్తిగత పత్రాలను అప్‌లోడ్ చేయాలి. అడ్మిషన్ ప్రాసెస్ సమయంలో ఒరిజినల్ కాపీలను తీసుకెళ్లాల్సి ఉంటుంది. 1) NEET 2021 అడ్మిట్ కార్డ్, 2) ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ కాపీ, 3) NEET మార్కుల షీట్, 4) Nationality సర్టిఫికేట్, 5) HSC (12వ తరగతి) మార్కుల షీట్, 6) ఏజ్ ప్రూఫ్ కోసం SSC (10వ తరగతి) సర్టిఫికేట్, 7) ఆధార్ కార్డ్.

Advertisement

తాజా వార్తలు

Advertisement