Thursday, May 2, 2024

NBK 107 హంట్ బిగిన్స్‌.. బాల‌య్య పోస్ట‌ర్‌కు భారీ క్రేజ్‌

NBK 107 బాలకృష్ణ న‌టిస్తున్న యాక్షన్ డ్రామా సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు.. ఈ చిత్రంలో బాలకృష్ణ స‌ర‌స‌న‌ శృతిహాసన్‌ క‌నువిందు చేయ‌నుంది.. కన్నడ నటుడు దునియా విజయ్‌ విలన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్, వై రవిశంకర్, సీవీ మోహన్ నిర్మిస్తుండ‌గా.. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. కాగా, తాజాగా #NBK107HuntBegins అంటూ బాల‌య్య ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేసింది సినీ యూనిట్.. ఇప్పుడా ఫొటో నెట్టింట్లో వైర‌ల్ గా మారింది. జై బాల‌య్య అంటూ అభిమానులు పోస్ట‌ర్‌ షేర్ చేస్తూ సంబుర‌ప‌డుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement