Monday, May 20, 2024

Breaking: ఆశీర్వదిస్తే.. బంగారు భార‌త‌దేశంగా తీర్చిదిద్దుతా: సీఎం కేసీఆర్​

అమెరికా కంటే మెరుగ్గా ఇండియాను తీర్చిదిద్దుతానని, తనను ఆశీర్వదిస్తే భారత రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకొస్తానన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్​. ఇప్పుడున్న పరిస్థితులు మార్చి.. భారత దేశానికి వీసా తీసుకుని వచ్చే పరిస్థితులు కల్పిస్తానన్నారు. అమెరికా మాదిరిగానే.. ఇతర దేశాలు ఇండియాకు రావాలంటే కంపల్సరీ వీసా తీసుకుని రావాల్సిన పరిస్థితులు వస్తాయన్నారు.

ప్ర‌భ‌న్యూస్ బ్యూరో, ఉమ్మ‌డి మెద‌క్‌: దేశంలో ప‌రిస్థితులు బాగా లేవ‌ని.. త‌న‌కు అవ‌కాశం వ‌స్తే ఈ దేశాన్ని బంగారు భార‌త దేశంగా మారుస్తాన‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు అన్నారు. ఇవ్వాల సంగారెడ్డి జిల్లాలోని నారాయ‌ణ‌ఖేడ్‌లో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న మాట్లాడారు. అంత‌కుముందు సంగ‌మేశ్వ‌ర‌, బ‌స‌వేశ్వ‌ర ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌కు శంకుస్థాప‌న చేశారు కేసీఆర్‌. బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ..

‘‘రైతు చ‌నిపోతే భార‌త్ లో ఎక్క‌డ కూడా వారంలో 5 లక్ష‌లు ఇచ్చే ప‌రిస్థితి లేదు.. అది జ‌ర‌గాలి అంటే వాతావ‌ర‌ణం మంచిగా ఉండాలి. అన్నీ బాగుండాలి. అన్నీ మంచిగా ఉంటేనే అంద‌రూ వ‌స్త‌రు. అంతే కానీ.. పొద్దున లేస్తే గొడ‌వ‌లు జ‌రిగితే వ‌స్త‌రా. ఏ ర‌క‌మైన తెలంగాణ ఉండాలి.. అన్ని వ‌ర్గాలు.. అన్ని కులాలు బాగుండాలి. రైతు చ‌నిపోతే భార‌త్ లో ఎక్క‌డ కూడా వారంలో 5లక్ష‌లు ఇచ్చే ప‌రిస్థితి లేదు. కానీ.. మ‌న ద‌గ్గ‌ర ఇస్తున్నాం. రైతు బంధు డ‌బ్బులు కూడా మీ బ్యాంకులోనే ప‌డిపోతున్నాయి. ఇండియాలో ఎక్క‌డ కూడా రావు. ఒక్క నారాయ‌ణ్‌ఖేడ్‌కే 100 కోట్లు యాసంగి, 100 కోట్లు ఖ‌రీఫ్‌కు వ‌స్తున్నాయ‌ని మంత్రి హ‌రీశ్ రావు చెబుతున్నారు.

మ‌హారాష్ట్ర బార్డ‌ర్ నుంచి 300 కిమీలు ప్ర‌యాణించి మ‌న సింగూరుకు నీళ్లు
ఒక‌ప్పుడు ఎక్క‌డ ఉన్న నారాయ‌ణ్‌ఖేడ్‌.. ఎక్క‌డ గోదావ‌రి.. ఎక్క‌డ మ‌న‌ సింగూరు.. బండారు శ్రీనివాస‌రావు గారు అని నాతో పాటే వ‌చ్చారు. సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌. ఎట్ల తీసుకొస్త‌రు సార్ నీళ్లు ఇక్క‌డికి అని అడిగారు. అక్క‌డ మ‌హారాష్ట్ర స‌రిహ‌ద్దులో ఉన్న గోదావ‌రి నుంచి 300 పైచిలుకు కిమీ ప్ర‌యాణం చేసి సింగూరుకు లిఫ్ట్ ద్వారా నీళ్లు వ‌స్తాయి. ఈ సింగూరు 14 టీఎంసీల నీళ్లు ఉండేవ‌ర‌కు.. నీళ్ల‌ను తీసుకొచ్చి సంగ‌మేశ్వ‌ర‌, బ‌స‌వేశ్వ‌ర ప్రాజెక్టుకు పంపిస్తుంది. బ్ర‌హ్మాండంగా సాగు నీరు అంద‌రికీ అందుతుంది.. అని సీఎం కేసీఆర్ వెల్ల‌డించారు.

ఒక వారం త‌ర్వాత తాను కేత‌గిలో ఉన్న సంగ‌మేశ్వ‌ర‌ దేవాల‌యానికి వ‌స్తాన‌ని.. అప్పుడే సంగారెడ్డి మెడిక‌ల్ కాలేజీకి కూడా ఫౌండేష‌న్ వేస్తాన‌ని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇప్ప‌టికే సంగారెడ్డికి మెడిక‌ల్ కాలేజీ ఇస్తామ‌ని చెప్పామ‌ని.. మంజూరు కూడా చేశామ‌ని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. జిల్లాలోని నారాయ‌ణ్‌ఖేడ్‌లో సంగ‌మేశ్వ‌ర‌, బ‌స‌వేశ్వ‌ర ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న చేసిన అనంత‌రం నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడిన సీఎం కేసీఆర్.. స‌భ‌లో మంత్రి హ‌రీశ్ రావు కోరిన కోర్కెల‌ను తీర్చారు. హ‌రీశ్ రావు బాగా హుషారు ఉన్న‌డు. ఏం లేదు వ‌చ్చి మాకు ఫౌండేష‌న్ వేస్తే చాలు అన్న‌డు. ఇక్క‌డికి వ‌చ్చిన త‌ర్వాత ఇది కావాలి.. అది కావాలి అని దుకాణం పెట్టిండు. సంగారెడ్డి మ‌న జిల్లా కేంద్రం. 50 కోట్లు కావాల‌న్న‌డు. రేపే జీవో ఇష్యూ జారీ చేస్తం.

- Advertisement -

సంగారెడ్డి, జ‌హీరాబాద్‌కు చెరో 50 కోట్లు ఇస్తాం. అలాగే మిగిలిన 6 మున్సిపాలిటీలు నారాయ‌ణ్‌ఖేడ్ మున్సిపాలిటీ, స‌దాశివ‌పేట్ మున్సిపాలిటీ, జోగిపేట మున్సిపాలిటీ, బొల్లారం మున్సిపాలిటీ, అమీన్ పూర్ మున్సిపాలిటీ, తెల్లాపూర్ మున్సిపాలిటీకి కూడా 25 కోట్లు మంజూరు చేస్తున్నాం. మంత్రి హ‌రీశ్ రావు, జిల్లా అధ్య‌క్షులు ప్ర‌భాక‌ర్ గారికి మ‌న‌వి ఏంటంటే.. డ‌బ్బులు వృథా చేయ‌కండి. అంద‌రూ క‌లిసి పాద‌యాత్ర చేసి ప్ర‌జ‌ల‌కు ఏం అవ‌స‌ర‌మో అది చేయండి. సంగారెడ్డి జిల్లాలో 699 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప‌ల్లెప్ర‌గ‌తి కార్య‌క్ర‌మం ద్వారా అద్భుత‌మైన ప‌నులు జ‌రుగుతున్నాయి. ఈరోజు మంత్రి గారు కోరారు. 699 గ్రామాల‌కు ప్ర‌తి గామానికి రూ.20 ల‌క్ష‌లు మంజూరు చేస్తున్నాం. 140 కోట్ల రూపాయ‌లు మంజూరు చేస్తున్నాం. రేపే దీనికి జీవో జారీ చేస్తాం. ఇది కూడా స‌ద్వినియోగం జ‌రిగేట‌ట్టు చూసుకోవాలి.. అని సీఎం తెలిపారు.

నిజాంపేట మండ‌లం కావాలి అని కోరారు. అది కూడా వెంట‌నే మంజూరు చేస్తాం. నారాయ‌ణ్‌ఖేడ్ ప్ర‌జ‌లు చాలా గౌర‌వంతో ఇక్క‌డ ఎమ్మెల్యేల‌ను గెలిపిస్తూ ఉన్నారు. మీ అంద‌రి దీవెన‌ల‌తో మ‌నం అన్ని రంగాల్లో దూసుకుపోతున్నాం. మ‌న త‌ల‌స‌రి ఆదాయం కూడా దేశంలో గ‌ర్వంగా చెప్పుకునే ప‌ద్ధ‌తిలో నెంబ‌ర్ వ‌న్ స్థానానికి ఎగ‌బాకుతున్నాం. ఇంకా అభివృద్ధి చెందే అవ‌కాశం ఉంది. దేశం కూడా 75 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత ఉండాల్సిన ప‌ద్ధ‌తిలో లేదు. దుర్మార్గ‌మైన వ్య‌వ‌హారం న‌డుస్తోంది. ప‌నికిమాలిన దందా జ‌రుగుతోంది. హైద‌రాబాద్‌లో బ్ర‌హ్మాండమైన ఐటీ ఇండ‌స్ట్రీ ఉంది. ఇప్పుడు పాటిల్ గారు చెప్తున్నారు. నిమ్స్ వ‌స్తా ఉంది జ‌హీరాబాద్‌కు.. త్వ‌ర‌లోనే పూర్తి చేయాలి అని కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement