Monday, April 29, 2024

Breaking: న‌య‌నతార‌ పెళ్లికి ముహూర్తం ఫిక్స్‌.. ఎక్క‌డంటే..

కోలీవుడ్ ప్రేమ జంట న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్‌లు పెళ్ళికి ముహూర్తం ఖరారైంది. తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్ గా తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నయనతార తన ప్రియుడు విఘ్నేష్ శివను పెళ్లాడనుంది.  ఏడేళ్ళ నుంచి డేటింగ్‌లో ఉన్న న‌య‌న్, విఘ్నేష్ జంట త్వ‌ర‌లో పెళ్ళి పీట‌లెక్క‌బోతున్నారు. వీరిద్ద‌రు తిరుమ‌ల‌లో శ్రీవారి స‌న్నిధిలో జూన్ 9వ తేదీన మూడు ముళ్ళ బంధంతో ఒక్క‌టి కాబోతున్నారు. దీని కోసం వీరిద్ద‌రూ త‌మ పెళ్లి కోసం వేదిక‌ను బుక్ చేసుకోవ‌డానికి తిరుమ‌ల‌లో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ క్రమంలో ఈ జంట‌ శ్రీవారిని ద‌ర్శించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement