Saturday, May 4, 2024

Spl Story: కోలాటాల చప్పుళ్లు, దాండియా ఆటలు.. హైదరాబాద్​ సిటీలో హ్యాపీడేస్ !​

సంతోషంగా ఉన్న జీవితాల్లోకి ఒక్కసారిగా ఉప్పెన వచ్చిపడింది. రెండేళ్లపాటు పక్కన ఉన్నవారితో మాట్లాడాలంటేనే భయం భయంగా ఉండేది. ఇంటి పక్కన ఉన్నవాళ్లు, వీధిలో ఉండేవాళ్లలో ఎవరు ఉన్నారో, ఎవరు పోయారో కూడా తెలియని దారుణ పరిస్థితుల నుంచి బయటపడ్డాం.. ఇప్పుడు అంతా హ్యాపీడేస్​ నడుస్తున్నాయి. కరోనా ఇంకా పూర్తిగా మన నుంచి దూరం కానప్పటికీ కాస్త ఉపశమనం దొరికింది. అయితే.. ఇట్లాంటి టైమ్​లో వస్తున్న పండుగళ వేళ ఎట్లాంటి సంబురాలు జరుగుతున్నాయో తెలుసుకుందాం.. దసరా నవరారతి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్​ సిటీలో జరిగే అతిపెద్ద ఉత్సవాలు, గర్భా డ్యాన్స్​లు, కోలాటాలు ఎక్కడ నిర్వహిస్తున్నారు. ఆ వివరాలు మీకోసం..

– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

అందరూ ఆత్రంగా ఎదురుచూసే సంవత్సరం అంటే ఇదేనని చెప్పవచ్చు.. హైదరాబాద్​ సిటీలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమైనందున పండుగల సీజన్​ని కూడా అధికారికంగా జరుపుతోంది ప్రభుత్వం. తొమ్మిది రాత్రుల ఉత్సవాలు వినోదం, దాండియా, దైవిక కార్యక్రమాలను ప్రజలు పూర్తి ఉత్సాహంతో జరుపుకుంటారు.

మహమ్మారి కారణంగా రెండేళ్ల తర్వాత నవరాత్రి మళ్లీ దాని సాధారణ పరిస్థితుల్లోకి వచ్చింది. దీంతో హైదరాబాద్​లో ఇప్పటికే అనేక చోట్ల గర్బా నైట్స్​ జరుగుతున్నాయి. దాండియా కర్రల క్లిక్-క్లాక్​ సౌండ్స్​తో సిటీ మారుమోగిపోతోంది. ఇక.. మీరు గ్యాంగ్‌తో కలిసి డ్యాన్స్ ఫ్లోర్‌లో కాలు కదపాలని ప్లాన్ చేస్తుంటే హైదరాబాద్​లో బెస్ట్​ ప్లేసెస్​ ఏమున్నాయో చూపిస్తాం.. అత్యంత ఎక్కువగా జరిగే గర్బా-నైట్‌ల లిస్టును తయారు చేశాం. ఇక.. మీ దాండియా స్టిక్‌లను రెడీ చేసుకోండి. (బుక్ మై షో ప్రకారం అందిస్తున్న సమాచారం)

హైదరాబాద్ 2022లో ఉత్తమ దాండియా, గర్బా నైట్స్​

- Advertisement -

1. హైదరాబాద్ లో అతిపెద్ద నవరాత్రి ఉత్సవం

• ప్లేస్​: హోటల్ ది పార్క్

• తేదీలు: సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 4 వరకు

2. దాండియా నైట్స్​

• ప్లేస్​: వండర్లా అమ్యూజ్‌మెంట్ పార్క్

• తేదీలు: అక్టోబర్ 1

3. హైదరాబాద్‌లో అతిపెద్ద నవరాత్రి ఉత్సవ్ (దాండియా ధమాల్)

• ప్లేస్​: ఇంపీరియల్ గార్డెన్స్

• తేదీలు: సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 4 వరకు

4. దాండియా నైట్స్ 2022

• ప్లేస్​: బేగంపేట్ హాకీ స్టేడియం

• తేదీలు: సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 4 వరకు

5. నవరాత్రి ఉత్సవ్ 2022

• ప్లేస్​: చిరాన్ కోట

• తేదీలు: సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 4 వరకు

6. మహా నవరాత్రి ఉత్సవ్ 2022

• ప్లేస్​: కంట్రీ క్లబ్ బేగంపేట

• తేదీలు: సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 2 వరకు

7. రంగతాలి

• ప్లేస్​: క్లాసిక్ కన్వెన్షన్ 3

• తేదీలు: సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 6 వరకు

8. దాండియా రాస్

• ప్లేస్​: బాంటియా గార్డెన్స్, సికింద్రాబాద్

• తేదీలు: సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 4 వరకు

ఇదంతా చదవితే సరదాగా అనిపిస్తుంది కదా? ఇక.. మీ దాండియా కర్రలు పట్టుకుని ఈ ప్రదేశాలకు వెళ్లండి. అట్లానే దిగువ మీ ఎక్స్​పీరియన్స్​ని కామెంట్​ చేయడం మాత్రం మరచిపోవద్దు!

Advertisement

తాజా వార్తలు

Advertisement