Tuesday, May 14, 2024

నాచ్ మేరీ రాణి సాంగ్ కి స్టెప్పులేసిన విద్యార్థిని – కామెంట్స్, లైక్ ల‌తో హోరెత్తిస్తున్న నెటిజ‌న్స్

టాలెంట్ కి పేద‌, ధ‌నిక అనే భేదం ఉండ‌ద‌న్న సంగ‌తి తెలిసిందే. కాగా సోష‌ల్ మీడియా వ‌చ్చాక మారు మూల జ‌రిగే విష‌యాలు కూడా అంద‌రికీ తెలిసేందుకు దోహ‌ద‌ప‌డుతున్నాయి. ఇప్పుడో వీడియో ఇన్ స్టాగ్రామ్ లో వైర‌ల్ గా మారింది. ఓ అమ్మాయి డ్యాన్స్ ఇర‌గ‌దీసింది. గురు రంధ‌వా, నోరా ఫ‌తేహి క‌లిసి న‌టించిన నాచ్ మేరీ రాణి పాట‌కు స్టెప్పులు అద‌ర‌గొట్టిందా అమ్మాయి. అయితే ఆమె డ్యాన్స్ చేసిన ప్రాంతం చూస్తే స్ల‌మ్ ఏరియాలా క‌నిపిస్తుంది. ఇక డ్యాన్స్ వేసిన అమ్మాయి స్కూల్ డ్రెస్ లో ఉండ‌టం విశేషం. ఆమె చేసిన క్రేజీ మూవ్స్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. వరుసపెట్టి లైకులు, కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ వీడియో నెట్టింట ట్రెండింగ్ కావడంతో గురు రంధావా, నోరా ఫతేహిలు కూడా దానిని రీ-ట్వీట్ చేసి.. ఆ అమ్మాయిని అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement