Monday, April 29, 2024

దేశంలో 90శాతం మందికి వ్యాక్సినేషన్.. 18 ఏళ్ల లోపు వారికి 1.5కోట్ల మందికి టీకాలు: మోడీ

దే శంలో 90శాతం కొవిడ్ వ్యాక్సినేషన్ కంప్లీట్ చేసినట్టు ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కోల్‌కతాలో చిత్తరంజన్ నేషనల్ కేన్సర్ ఇన్‌స్టిట్యూట్ (సిఎన్‌సిఐ) రెండో క్యాంపస్‌ను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మాట్లాడారు. పశ్చిమ బెంగాల్‌కు కేంద్ర ప్రభుత్వం 11 కోట్ల ఉచిత డోస్‌లను అందజేసినట్టు ప్రధాని శుక్రవారం తెలిపారు. 1,500కి పైగా వెంటిలేటర్లు, 9వేల ఆక్సిజన్ సిలిండర్లను అందించామన్నారు.. 49 PSA ఆక్సిజన్ ప్లాంట్లు కూడా అందుబాటులోకి తెచ్చినట్టు పేర్కొన్నారు. ఇవన్నీ బెంగాల్ ప్రజలకు ఎంతో సహాయపడతాయని ప్రధాని మోడీ అన్నారు. కాగా, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా కేన్సర్ ఇనిస్టిట్యూట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

కేవలం 5 రోజుల వ్యవధిలో 15, -18 ఏళ్ల మధ్య వయసున్న 1.5 కోట్ల మందికిపైగా పిల్లలకు మొదటి డోస్ వ్యాక్సినేషన్ ఇచ్చామని ప్రధాని మోడీ తెలిపారు. అర్హత ఉన్న మొత్తం దేశ జనాభాలో 90% మంది కనీసం ఒక డోస్ పొదారని అన్నారు. కేవలం 5 రోజుల్లో, 15,-18 సంవత్సరాల మధ్య వయస్సు గల 1.5 కోట్ల మంది పిల్లలకు వ్యాక్సిన్ అందించామని అని ప్రధాని అన్నారు.

కాగా, ప్రధానమంత్రి కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం.. ఈరోజు (శుక్రవారం) వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాని మోడీ CNCI రెండవ క్యాంపస్ ను ప్రారంభించారు. దీన్ని ₹530 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించారు. దీనిలో సుమారు ₹400 కోట్లు కేంద్ర ప్రభుత్వం భరించింది. మిగిలినవి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 75:25 నిష్పత్తిలో కేటాయించింది. కాగా, క్యాంపస్ లో కేన్సర్ నిర్ధారణ, స్టేజింగ్, చికిత్స, సంరక్షణ కోసం అత్యాధునిక మౌలిక సదుపాయాలు కల్పించారు. 460 బెడ్స్ తో సమగ్ర కేన్సర్ సెంటర్ యూనిట్ ఏర్పాటు చేశారు. క్యాంపస్‌లో న్యూక్లియర్ మెడిసిన్ (PET), 3.0 టెస్లా MRI, 128 స్లైస్ CT స్కానర్, రేడియోన్యూక్లైడ్ థెరపీ యూనిట్, ఎండోస్కోపీ సూట్, ఆధునిక బ్రాకీథెరపీ యూనిట్లు మొదలైన ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. క్యాంపస్ అధునాతన కేన్సర్ పరిశోధనా సౌకర్యంగా కూడా పని చేస్తుంది. ముఖ్యంగా దేశంలోని తూర్పు, ఈశాన్య ప్రాంతాలకు చెందిన కేన్సర్ రోగులకు సమగ్ర సంరక్షణ చర్యలు అందే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement