Wednesday, May 15, 2024

మున్సిప‌ల్ కార్మిక సంఘాల జేఏసీ ఐక్య పోరాటాల ఫ‌లిత‌మే జీతాల పెంపు

మున్సిపల్‌ కార్మిక సంఘాల జేఏసీ ఐక్య పోరాటాల ఫలితమే మున్సిపల్‌ కార్మికులకు జీతాల పెంపు అని, జీతాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల మున్సిపల్‌ కార్మిక సంఘాల జేఏసీ హర్షం వ్య‌క్తం చేసింది. ఈ మేరకు వేతనాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినందుకు వారు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్, హిమాయత్ నగర్, సత్యనారాయణ రెడ్డి భవన్ లో మున్సిపల్‌ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్మికులకు వేతనాలు పెంచినందుకు విజయోత్సవ సభ జరిగింది కె. ఏసురత్నం, కె.జయచంద్ర, వి. జయపాల్ రెడ్డి (ఏఐటీయూసీ), జె.వెంకటేశం, పాలడుగు భాస్కర్ (సిఐటియు), పి.శివబాబు, కె.స్వామి (ఐ.ఎఫ్.టి.యు), ప్రవీణ్, ఎస్.కిరణ్ (ఐ.ఎఫ్.టి.యు) తదితరులు పాల్గొన్నారు. ఈ సభలో వారు కేక్ కట్ చేసి, స్వీట్లు పంచుకొని సంబురాలు జరుపుకున్నారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కార్మిక సంఘాల జేఏసీ చేసిన అలుపెరుగని ఐక్య పోరాటాల ఫలితమే మున్సిపల్‌ కార్మికులకు జీతాలు పెరిగాయని తెలిపారు. జీహెచ్ఎంసీ తో సహా రాష్ట్రంలోని మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు, నగర పంచాయితీలలో పారిశుద్ధ్యం, పార్క్‌లు, వాటర్‌ సప్లై, స్ట్రీట్‌ లైటింగ్‌, మలేరియా, డ్రైవర్లతో పాటు వివిధ కేటగిరిలలో కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, కార్మికులుగా సంవత్సరాల తరబడి పని చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రం వస్తే కాంట్రాక్టు వ్యవస్థ రద్దవుతుందని కాంట్రాక్టు పద్ధతుల్లో పనిచేస్తున్న మున్సిపల్‌ కార్మికులంద‌రూ పర్మినెంట్‌ అవుతారని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ అందరినీ పర్మినెంట్ చేసి తన మాట నిలబెట్టుకోవాలని వారు కోరారు. ప్రతినెలా క్రమం తప్పకుండా వేతనాలివ్వాలని, పి.ఎఫ్‌, ఇ.యస్‌.ఐ ఖాతాలను కచ్చితంగా నిర్వహించాలని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేసారు. జీతాల పెంపు ప్రభుత్వం ఉత్తర్వు తప్పులతడకగా ఉందని విషయం పై ఈ నెల 10వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలుస్తున్నామని వారు వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement