Thursday, May 2, 2024

ఎన్‌.సి.ఎస్‌లోఈ ఏడాదికి చెరకు క్రషింగ్‌ కష్టమే..

అయోమయంలోవేలాదిమంది చెరకు రైతులు, వందలాది కార్మికులు..
బకాయిలు16.35కోట్ల రూపాయలు చెల్లించేదెపుడు..
సీతానగరం, ప్రభ న్యూస్ : రైతుల సంక్షేమమే ప్రధాన లక్ష్యమని చెప్పుకుంటోన్న వైస్సార్‌ ప్రభుత్వం.. విజయనగరంజిల్లాలో చెరకు రైతులు గోడు చూస్తే అందరికీ బాధ కలుగుతోంది. ఇప్పటికే రెండేళ్లుగా భీమసింగి సహకార చక్కెర కర్మాగారంలో గానుగాను ఆధునీకరణ పేరిట నిలిపివేశారు. ఇప్పుడు లచ్చయ్యపేట ఎన్‌ సి ఎస్‌ చక్కెర కర్మాగారం వంతు వచ్చింది.గతరెండేళ్లుగాచెరకుడబ్బులు అందక చెరకురైతులు పడేఇబ్బందులు అంతాఇంతాకాదు.మిగిలినజిల్లాలకంటే విజయనగరంజిల్లాలో రైతులలో నేడునైరాశ్యం ఉంది.జిల్లాలో పలు పరిశ్రమలుమూతబడుతున్న తరుణంలోనేడు చక్కెర,ధాన్యంపరిశ్రమలవంతువచ్చినట్లు- స్పష్టంగా కనిపిస్తోంది.దీనికిసంబంధించి వివరాలు పరిశీలిస్తే పార్వతీపురం రెవెన్యూడివిజన్‌ లోని సీతానగరం మండలం లచ్చయ్యపేటలోని ఎన్‌. సి. ఎస్‌ చక్కెర కర్మాగారంఉంది. దీని పరిధిలో15మండలాలకు చెందిన12వేలమంది రైతులు దాదాపు 12వేల ఎకరాల్లో చెరకు సాగు చేసేవారు. గత ఐదేళ్లుగా యాజమాన్యం అనుసరిస్తున్న నిర్లక్ష్యం, బకాయిలు పెరుకుపోవడం తదితర కారణాలతో గణనీయంగా విస్తీర్ణం తగ్గింది. దీంతోపాటు- రైతులకు,కార్మికులకు, ప్రభుత్వానికికలిపి గతరెండు సీజన్లో సుమారు25కోట్ల రూపాయలమేర బకాయిలను యాజమాన్యంచెల్లించాల్సిఉంది. దీనిపైఇంతవరకుయాజమాన్యం ఎటువంటి చర్యలుతీసుకోలేదు. యాజమాన్యం అందుబాటు-లోలేకఇటు-రైతులు,అటు-కార్మికులు లబోదిబోమంటున్నారు. వారిగోడును పట్టించుకునే నాధుడే కరువయ్యారు.

గతంలో2015-16,2017-18, 2018-19సంవత్సరాలలోకూడా యాజమాన్యం రైతులకు 20.70కోట్ల రూపాయలు బకాయిలున్న సమయంలో అప్పట్లో ప్రజా ప్రతినిధులు,అధికారుల ఒత్తిడితో కర్మాగారంలో ఆర్‌. ఆర్‌ చట్టం అమలుచేసి కర్మాగారంకు చెందిన62.47ఎకరాల భూమినివేలంవేసి రైతులబకాయిలు, కార్మికుల బకాయిలుచెల్లించారు. నేడు కర్మాగారం ఆవరణలోని కర్మాగారం,యంత్రాలు, భూములుతప్ప కర్మాగారం వెలుపల విలువైనభూములు లేకపోవడంతో బకాయిలు చెల్లింపుసాధ్యంకాదని స్పష్టంగా కనిపిస్తోంది.గత ఏడాదినుండి ఇదిగో అదిగోఅంటు- రకరకాల హామీలుఇచ్చిన యాజమాన్యంనేడు స్పందించకపోవడంతో రైతులు, కార్మికులు ప్రభుత్వంపై ఆగ్రహంవ్యక్తంచేస్తున్నారు. దీనిలో భాగంగా గత వారంలో పెద్ద ఎత్తున రైతులు, మహిళలు కర్మాగారంవద్ద నిర్వహించిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. దీంతో ప్రభుత్వం దిగివచ్చి రైతుల బకాయిలు చెల్లింపు కోసం మరలా ఆర్‌ ఆర్‌ చట్టం సత్వరమే అమలుకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగానే ఈనెల కర్మాగారంఆవరణలోని గుడౌన్‌ లోగల పదిన్నర కోట్ల విలువైన పంచదార నిల్వలు వేలంవేయడానికి గెజిట్‌ జారీ చేసింది. ఈనెల23న వేలం వేసి రైతులకు చెల్లిస్తామని ప్రజా ప్రతినిధులు, అధికారులు తెలిపారు. దీంతోపాటు- కర్మాగారంవెలుపలగల సుమారు20ఎకరాల భూమిని కూడా వేలం వేసేందుకు ఇప్పటికే ఫారం-5జారీచేసింది.

ఇంతవరకు పురోగతి కనిపిస్తున్న తరుణంలో లచ్చయ్యపేటలోగల ఈచక్కెరకర్మాగారంపూర్తిగా ప్రైవేట్‌ యాజమాన్యంలో ఉండటంతో ఈఏడాది గానుగాకు భరోసా ఇచ్చేపరిస్థితిలేదు. ప్రభుత్వం కూడా పరోక్షంగా కర్మాగారంలోఈఏడాది గానుగా నిలిపేదిశగా అడుగులు వేస్తున్నట్లు- స్పష్టంగా కనిపిస్తోంది.దీంతోసుమారు5వేలఎకరాల్లో చెరకు విస్తీర్ణంఉండి లక్ష టన్నుల వరకుచెరకుఉండటంతో వాటినిఎవరికి సరాపరా చేయాలో తెలియక రైతులుతలలుపట్టు-కుంటు-న్నారు. సాధారణంగా చెరకుగానుగాప్రారంభించడానికి నాలుగునెలలనుండి కర్మాగారంలో యంత్రాలను సిద్ధంచేయడం, మరమ్మతులుచేయడం,కొత్త మిషనరీ అమర్చడం, ఆయిలింగుపనులు చేయడంలో కార్మికులు నిమగ్నమవ్వాలి.దానికోసం సుమారు రెండునుంచి మూడుకోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆగస్టునెలనుండిపనులు ప్రారంభిస్తేకానిగానుగా వేయడం సాధ్యం కాదు. ఈచక్కెరకర్మాగారంలో యాజమాన్యం అందుబాటులో లేక ఆ దిశగా ఎటువంటి చర్యలుచేపట్టలేదని కార్మికులుచెబుతున్నారు.మరో ప్రక్క ఏడునెలలనుండి కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవడంతోవారంతా పస్తులతో ఉంటు-న్నారు. కర్మాగారంలో గానుగా వేయకపోతే తమ పరిస్థితి ఏమిటని వారంతా ప్రశ్నిస్తున్నారు. తమకురావాల్సిన సుమారు ఆరుకోట్లరూపాయలుఎవరు ఇస్తారో తెలియని పరిస్థితి ఉండటంతో కార్మికులు లబోదిబోమంటు-న్నారు.

ఎన్‌ సి. ఎస్‌ చక్కెరకర్మాగారాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి:
రెడ్డి. ఈశ్వరరావు
చెరకురైతుసంఘం నాయకులు..
లచ్చయ్యపేట ఎన్‌ సి ఎస్‌ కర్మాగారాన్ని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకుని యాజమాన్యంపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని చెరకు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి. లక్ష్మీ నాయుడు డిమాండ్‌ చేశారు.గత ఆరేళ్ల నుండి రైతులకు పెద్ద ఎత్తున బకాయిలు ఉంచి యాజమాన్యం మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గత రెండేళ్లుగా రైతుచెరకు రైతులకు, కార్మికులకు 25కోట్ల రూపాయలు చెల్లింపు చేయాల్సిన యాజమాన్యం నేడు కనిపించక పోవడందారుమన్నారు. తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకుని గానుగను ఇక్కడే నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

కర్మాగారంలో గానుగను నిర్వహించాలి
ఒమ్మి రమణ, సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి
ఎన్‌. సి. ఎస్‌ చక్కెర కర్మాగారంలో చెరకు గానుగను నిర్వహించాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి ఒమ్మి రమణ డిమాండ్‌ చేశారు. కర్మాగారంలో రైతులకు16.5కోట్ల రూపాయలు, కార్మికులకు6.5కోట్లరూపాయలనుయాజమాన్యం చెల్లింపు చేయకున్న వారిపై ఎటు-వంటి చర్యలు తీసుకోలేదన్నారు.బకాయిలు చెల్లించాలని ధర్నా చేసిన రైతులపై కేసులు పెట్టిజైల్లో పెట్టడం సమంజసమేనా అనిప్రశ్నించారు.రైతుల, కార్మికులు గోడును ప్రభుత్వం పట్టించుకోవాలన్నారు.చెరకు గానుగకు తగు ఏర్పాట్లు- చేయాలని కోరారు. తక్షణమే రైతులతో సమావేశంనిర్వహించాలన్నారు.లచ్చయ్యపేట, భీమసింగిలలోచెరకు క్రషింగ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఇటీ-వల ధర్నా చేసిన రైతులపై పెట్టిన కేసులను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement