Tuesday, April 30, 2024

Sunday Wibes | సంగీతం, ఫొటోగ్ర‌ఫీ రిలీఫ్‌నిస్తాయి: ఎంపీ జోగిన‌ప‌ల్లి

ప్ర‌కృతి అందాలు.. ప‌చ్చ‌ద‌నం అంటే మ‌క్కువ చూపుతారు గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్య‌వ‌స్థాప‌కుడు, ఎంపీ జోగిన‌ప‌ల్లి సంతోష్‌కుమార్‌. ఇప్ప‌టికే కోట్లాది మంది గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా మొక్క‌లు నాటారు. ఇంకా ఆ ప్ర‌క్రియ ఉద్య‌మంలా కొన‌సాగుతోంది. అయితే.. ప్ర‌తి ఆదివారం ఓ కొత్త సందేశాన్ని ఇస్తూ.. ట్విట్ట‌ర్‌లో త‌న మ‌నోభావాల‌ను షేర్ చేసుకుంటారు సంతోష్‌. అయితే.. ఈ సండే మాత్రం ప్ర‌కృతి ర‌మ‌ణీయ‌త‌ను తెలిపే కొన్ని ఫొటోల‌ను షేర్ చేస్తూ.. దానికి త‌గ్గ‌ట్టే ఓ అంద‌మైన కొటేష‌న్ యాడ్ చేశారు.

జ‌ర్మ‌నీకి చెందిన భౌతిక శాస్త్రవేత్త ఆల్బ‌ర్ట్ ఐన్‌స్టీన్ చెప్పిన అంశాల‌ను పేర్కొంటూ ఈ సందేశాన్ని తెలిపారు. ఐన్‌స్టీన్‌ చెప్పినదాన్ని గట్టిగా నమ్మండి.. ప్రకృతిని లోతుగా పరిశీలించండి. మీరు ప్రతిదీ బాగా అర్థం చేసుకుంటారు. సంగీతం అండ్ ఫోటోగ్రఫీ ద్వారా మ‌రింత‌గా పునరుజ్జీవనం అవుతారు.. అంటూ ప‌క్షుల ఫొటోల‌ను షేర్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement