Tuesday, May 14, 2024

అమ్మా నేనేం పాపం చేశాను.. నా నోరు మూసేశావు!

‘’అమ్మా నేను ఏం పాపం చేశాను నోట మాట రాక ముందే నా నోరు మూసేశావు. నన్ను పది నెలలు కడుపులో మోసి ఈ భూమ్మీదకు తీసుకు వచ్చావు. తల్లిదండ్రుల ఆలనాపాలనా లో పెరగాల్సిన నన్ను ఏడాది తిరగ్గానే నా పసి హృదయాన్ని గొంతు ఛి మేసి పరలోకానికి పంపావు. ఇది నీకు న్యాయమా అమ్మా’’ ఇది చిన్నారి విక్రమసింహ మనోవేదన.

పది కాలాల పాటు కంటికి రెప్పలా కాచుకోవాల్సిన తల్లే చిన్నారి విక్రమసింహ పాలిట శాపమైంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో కన్నతల్లి కన్నకొడుకు చిన్నారి విక్రమసింహ గొంతు కోసి చంపి ఆపై తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ  దారుణ సంఘటన కర్నూలు జిల్లా రుద్రవరం మండలంలో బుధవారం చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. రుద్రవరంలోని బలిజ కాలనీలో నివాసం ఉంటున్న పోలా రామచంద్రుడు లక్ష్మీదేవి దంపతుల కుమారుడు సుధాకర్ కు అక్క కూతురైన మౌనికతో గత మూడు సంవత్సరాల క్రితం వివాహం జరిపించారు. సుధాకర్ మౌనిక దంపతులకు  విక్రమసింహ సంవత్సరం క్రితం జన్మించాడు. గత మూడు రోజుల క్రితం చిన్నారి విక్రమసింహా కు పుట్టినరోజు వేడుకలు నిర్వహించినట్లు కాలనీవాసులు చెబుతున్నారు. ఈ మూడు రోజులలో కుటుంబంలో ఎటువంటి సమస్యలు తలెత్తాయో ఏమోగానీ బుధవారం ఉదయం కుటుంబ సభ్యులంతా పొలం పనులకు వెళ్లగా ఇంట్లో ఎవరు లేని సమయంలో మౌనిక కుమారుడైన చిన్నారి విక్రమసింహ గొంతు కోసి చంపింది. అనంతరం తల్లి మౌనిక న్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన బంధువులు చుట్టుపక్కల వారు పొలం పనులకు వెళ్లిన భర్తకు సమాచారం అందించారు. ఇంట్లో రక్తపుమడుగులో పడివున్న చిన్నారి విక్రమసింహను చూసి బోరున విలపించారు. పక్కనే అపస్మారకస్థితిలో ఉన్న మౌనిక ను చికిత్స నిమిత్తం 108 వాహనం ద్వారా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రక్తపు మడుగులో ఉన్న చిన్నారి విక్రమసింహ మృతి సంఘటన పలువురికి కంటతడి పెట్టించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి చెరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement