Tuesday, April 30, 2024

ఏపీలో కరోనా ప్రకంపనలు.. ఒక్క రోజులో 7 వేలపైగా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్‌ బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ భారీగా పెరుగుతోంది. సెకండ్‌ వేవ్‌లో మొదటిసారి ఆంధ్రప్రదేశ్‌లో 7 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు శనివారం సాయంత్రం ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది.

గడిచిన 24 గంట్లలో 35,907 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 7,224 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. మహమ్మారి కారణంగా 15 మంది మృతి చెందారు. కోవిడ్ తో చిత్తూరులో 4, నెల్లూరులో 3, కర్నూల్, విశాఖలో ఇద్దరు, గుంటూరు, కడప, కృష్ణ, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.  గడిచిన 24 గంటల్లో 2,332 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 9,55,455కి కరోనా కేసులు చేరగా, ఇప్పటివరకు కరోనా వైరస్ తో 7,388 మరణించారు. ఏపీలో 40,469 యాక్టివ్‌ కేసులు ఉండగా, 9,07,598 మంది రికవరీ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,56,42,070 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement