Saturday, April 27, 2024

Flash: నక్సలైట్ ప్రాంతాలలో సైనికులకు ఉపశమనం

నక్సలైట్ ప్రాంతాలలో సైనికులకు ఉపశమనం లభించింది. దట్టమైన అడవులు, రాళ్లతో కూడిన రోడ్లు ఉన్న నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యే ఆపరేషన్లు, ఎన్ కౌంటర్లు,  ఐఈడా పేలుళ్లు జరిగినప్పుడు గాయపడిన CRPF,  ఇతర బలగాలను కాపాడేందుకు ఎయిర్ అంబులెన్ల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా.. ప్రభుత్వం ప్రత్యేక సదుపాయాలను కల్పించింది. దట్టమైన అడవిలో గాయపడిన జవాన్ లను ఆసుపత్రికి తరలించేందుకు హెలికాప్టర్ లను అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటి ద్వారా అర్థరాత్రి సమయంలో కూడా సేవలు అందించవచ్చు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఆపరేషన్లు చేయడంతో పాటు, గాయపడిన సైనికులను  తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఈ సదుపాయాలు కల్పించింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 20కి పైగా హెలిప్యాడ్లను అందుబాటులో తీసుకువచ్చారు.

ఈ హెలిప్యాడ్లను ఛత్తీస్ గఢ్ లో 13, జార్ఖండ్ లో 3, ఒడిశాలో 4 రాత్రిపూట కూడా సేవలు అందించేందుకు ఏర్పాటు చేశామని హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి తెలిపారు. రానున్న కాలంలో ఈ హెలిప్యాడ్ల సంఖ్యను పెంచనున్నట్లు తెలిపారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో హోం మంత్రిత్వ శాఖ భద్రతా బలగాల ఉనికిని పెంచుతున్నట్లు అధికారి తెలిపారు. ఈ పరిస్థితిలో, హెలిప్యాడ్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రాణనష్టం జరగకుండా సకాలంలో క్షతగాత్రులను  ఆసుపత్రిలో చేర్చవచ్చు. ప్రస్తుతం నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో రాత్రిపూట గాయపడిన సైనికులను ఆస్పత్రికి తరలించడం కష్టసాధ్యంగా ఉన్నందున ఈ సదుపాయాలు కల్పించారు.

ప్రస్తుతం నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఆపరేషన్ సమయంలో గాయపడిన సైనికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని. ఆర్మీ హెలికాప్టర్ రాత్రి చీకటిలో ఆపరేషన్ స్థలంలో ల్యాండ్ కాకపోవడంతో చాలాసార్లు CRPF సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల, CRPF కోబ్రా అసిస్టెంట్ కమాండెంట్ వైభవ్ విభోర్ నక్సలైట్ల IED దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. బీహార్‌లోని ఔరంగాబాద్లోని మదనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విభోర్ జవాన్ సురేంద్ర కుమార్ కూడా గాయపడ్డాడు. అడవిలో సీఆర్ షీ 0 ఆపరేషన్ జరుగుతున్న సమయంలో సమీపంలోని ఏ స్థావరాల్లోనూ హెలికాప్టర్ లేదు. గాయపడిన వారు గయా చేరుకోవడానికి అంబులెన్స్ లో చాలా గంటలు ప్రయాణించాల్సి వచ్చింది. ఈ అంబులెన్స్ గయాకు చేరుకున్నప్పుడు, రాత్రిపూట హెలికాప్టర్ నడపడానికి అనుమతి ఇవ్వలేదు. అటువంటి పరిస్థితిలో, క్షతగాత్రులను 19 గంటల తర్వాత ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించారు. దీంతో అసిస్టెంట్ కమాండెంట్ విభోర్ తన రెండు కాళ్లను కోల్పోయాడు. దీంతో పాటు జవాన్ చేతి వేళ్లు కూడా కోల్పోయాడు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక హెలిప్యాడ్లను రూపొందించామని, రానున్న రోజుల్లో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లోనూ వీటి సంఖ్యను పెంచుతామని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement