Thursday, May 2, 2024

Monsoon – నైరుతి వ‌చ్చేసింది…కేర‌ళ‌ను తాకేసింది….

తిరువ‌నంత‌పురం – కొన్నిరోజులుగా రానురానంటున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు గురువారం కేరళ తీరాన్ని తాకాయి. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. రుతుపవనాల రాకతో బుధ‌వారం రాత్రి భారీగా వ‌ర్షం కుమ్మేయ‌డంతో కేరళ తీర ప్రాంతాల్లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. ఇది ఇలా ఉంటే నిర్ణీత షెడ్యూల్ ప్రకారం అయితే జూన్ 1నే రుతుపవనాలు ప్రవేశించాలి. కాకపోతే వారం రోజులు అటూ ఇటుగా రావడం సాధారణం. జూన్ 5 నాటికి రావచ్చని తొలుత భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే మ‌ధ్య‌లో బంగాళ‌ఖాతంలో తుఫాన్ ఛాయ‌లు క‌నిపించ‌డంతో నైరుతి రాక మూడు రోజులు ఆల‌స్య‌మైంది..

ఇక ప్రముఖ ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ సైతం ఈ నెల 8, 9 వ తేదీల్లో రుతుపవనాలు కేరళ తీరాన్ని చేరతాయని అంచనా వేసింది. ఈ అంచనాలు నిజమయ్యాయి. నైరుతి రుతుపవనాలు మరో వారం రోజుల్లో రాయలసీమలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అక్కడి నుంచి రెండు మూడు రోజుల వ్యవధిలో రెండు తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించనున్నాయి. ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది నైరుతిలో వర్షపాతం సాధారణంగానే ఉండొచ్చన్నది వాతావరణ శాఖ అంచనా.

Advertisement

తాజా వార్తలు

Advertisement