Thursday, May 2, 2024

మోడీకి స‌రిలేరు… ఈ జ‌గాన‌

న్యూఢిల్లి: ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా భారత ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ఆవిర్భవించారు. తాము చేపట్టిన సర్వేలో 76 శాతం ఆమోదిత రేటింగ్‌లతో అంతర్జాతీయంగా అగ్రస్థానం లో ఉన్న నేతగా నరేంద్ర మోడీ అవతరించారని అమెరికాకు చెందిన మోర్నింగ్‌ కన్సల్ట్‌ సంస్థ ప్రకటించింది. మొత్తం 22 మంది అంతర్జాతీయ నేతలపై సర్వేను చేపట్టినట్టు తెలిపింది. 41 శాతం ఆమోదిత రేటింగ్‌లతో ఆరవ స్థానంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, 34 శాతం ఆమోదిత రేటింగ్‌లతో 10వ స్థానంలో యూకే ప్రధాని రిషి సునాక్‌ నిలిచారు. 61 శాతం రేటింగ్‌లతో మెక్సికో అధ్యక్షుడు లోపెజ్‌ ఒబ్రాడొర్‌ రెండవ స్థానంలో, 55 శాతం రేటింగ్‌లతో , 49 శాతం ఆమోదిత రేటింగ్‌లతో బ్రెజిల్‌ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన లూయిజ్‌ ఇనాకియో ద సిల్వా ఐదవ స్థానంలో నిలిచారని సర్వే వెల్లడించింది.

ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బెనీస్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మాక్రోన్‌, కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడా సైతం భారత ప్రధాని తర్వాతి స్థానాలతో సరిపెట్టుకున్నారని తెలిపింది. ”’2023 సంవత్సరం మార్చి 22వ తేదీ నుంచి 28వ తేదీ మధ్యకాలంలో వేర్వేరు దేశాల్లో పౌరుల నుంచి సేకరించిన అభిప్రాయాలతో కూడిన డాటా ప్రాతిపదికగా తాజా ఆమోదిత రేటింగ్‌లు ఇవ్వడం జరిగింది” అని మార్నింగ్‌ కన్సల్ట్‌ తెలిపింది. ఇదే అమెరికా సంస్థ ఫిబ్రవరిలో వెలువరించిన సర్వే ఫలితాల్లో సైతం 78 శాతం ఆమోదిత రేటింగ్‌లతో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ప్రధాని మోడీ అగ్రస్థానంలో నిలిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement