Friday, May 20, 2022

KTR: మోదీ జీ, మీరు గుజరాత్‌కే కాదు భారతదేశానికి ప్రధాని

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ మంత్రి కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ‘’మోదీజీ మీరు గుజ‌రాత్‌కే కాదు భార‌త దేశానికి ప్ర‌ధాని’’ అని కేటీఆర్ అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాలపై గురువారం గుజ‌రాత్‌కు చెందిన ల‌బ్ధిదారుల‌తో ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా త‌న కూతురు వైద్య విద్య అభ్య‌సించ‌లేక‌పోయిందని గుజ‌రాత్‌కు చెందిన ఓ వ్య‌క్తి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీనిపై స్పందించిన ప్రధాని మోదీ.. ఈ విషయంపై తాను దృష్టి సారిస్తాన‌ని, మీ కుమార్తె వైద్య విద్య అభ్య‌సించేందుకు ఏమైనా సాయం చేయ‌గ‌ల‌మేమో ప‌రిశీలిస్తామ‌ని చెప్పారు.

దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. గ‌డ‌చిన ఎనిమిదేళ్లుగా తెలంగాణ‌కు ఒక్క వైద్య క‌ళాశాల కూడా మంజూరు చేయ‌కుండా రాష్ట్రానికి చెందిన ల‌క్ష‌లాది మంది విద్యార్థుల‌ ఆశ‌యాల‌ను నీరుగార్చార‌ని మండిపడ్డారు. అభివృద్ధి ప‌థంలో దూసుకుపోతున్న తెలంగాణ‌పై ఈ వివ‌క్ష ఎందుక‌ని కేటీఆర్ ప్ర‌శ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement