Saturday, April 27, 2024

ఎమ్మెల్సీ క‌విత బ‌ర్త్ డే – స‌ముద్రంలో ప‌ది ప‌డ‌వ‌ల‌పై క‌విత ఫొటోల‌తో ప్ర‌ద‌ర్శ‌న‌

టిఆర్ ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లాకు చెందిన చిన్ను గౌడ్ అనే నాయ‌కుడు ఎమ్మెల్సీ క‌విత‌పై త‌నకి ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. అరేబియా మహా సముద్రం ఒడ్డున మహాబలేశ్వర ఆలయంలోని ఆత్మలింగం సమీపాన సముద్రంలో పది పడవలపై ఎమ్మెల్సీ కవిత ఫొటోలతో కూడిన గులాబీ రంగు జెండాలను ప్రదర్శిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది. నేడు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ముద్దుల కూతురు కల్వకుంట్ల కవిత జన్మదినం. ఈ సందర్భంగా అభిమానులు పలు ప్రాంతాల్లో వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఉద్యమ నాయకుడి కూతురు అంటూ.. తమకు నచ్చిన విధంగా సెలబ్రేషన్స్‌ నిర్వహిస్తున్నారు టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement