Thursday, May 2, 2024

ఉన్నతమైన విద్య కోసమే ‘మన ఊరు మన బడి’

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా ఉన్నతమైన విద్యను విద్యార్థులకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. శనివారం ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలంలోని రాంక్య తండాలో ”మన ఊరు మన బడి” కార్యక్రమాన్ని మంత్రి పువ్వాడ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. మండల ప్రాథమిక ఉన్నత పాఠశాలలో సీఎం కేసిఆర్ ఆలోచనకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమ ప్రాధాన్యతను మంత్రి పువ్వాడ వివరించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించి ఉన్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అన్ని రకాల సేవలను విస్తృతం చేస్తూ వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాగా, ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు ఎంపీపీ, సర్పంచ్ వార్డు సభ్యులు, టిఆర్ఎస్ నాయకులు , అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement