Monday, April 29, 2024

చిన్నారి పాల‌కోసం త‌ల్లి ట్వీట్ – స్పందించిన రైల్వేశాఖ మంత్రి

ఈ మ‌ధ్య‌కాలంలో ప‌లువురు రాజ‌కీయ‌నాయకులు సోష‌ల్ మీడియాలో ఎంతో యాక్టీవ్ ఉంటూ ప‌లు స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రిస్తున్నారు. కాగా ఓ మ‌హిళ త‌న బిడ్డ‌కి పాలు కావాల‌ని రైల్వే శాఖ మంత్రికి ట్వీట్ చేసింది. ఇది చూసి మంత్రి వెంట‌నే స్పందించారు. బిడ్డ ఆక‌లి తీర్చేలా త‌గ్గిన ఏర్పాట్లు చేశారు. 23నిమిషాల్లో ఆక‌లితో ఏడ్చే చంటిబిడ్డ ఆక‌లిని తీర్చింది రైల్వేశాఖ‌. ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్‌పూర్‌కు చెందిన అంజలీ తివారీ అనే మహిళ లోకమాన్య తిలక్‌ టెర్మినల్‌ నుంచి ఎల్‌టీటీ (12143) ట్రైన్‌ ఏసీ 3కోచ్‌లో ప్రయాణిస్తోంది. రైలు మధ్యాహ్నం 2.30 గంటలకు భీమ్‌సేన్ స్టేషన్‌కు చేరుతుండగా..ఆమె ఎనిమిది నెలల చంటిపాప ఆకలితో ఏడవడం ప్రారంభించింది. తల్లి ఎంత సముదాయించినా ఏడుపు ఆపలేదు. బిడ్డ ఆకలితో ఏడుస్తుంటే అంజలికి ఆమె కుటుంబ సభ్యులకు ఏం చేయాలో తెలియలేదు.

దీంతో ‘పాప ఏడుస్తోందని.. పాలు కావాలంటూ’ 2.52 గంటలకు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు ట్వీట్‌ చేసింది. వెంటనే స్పందించిన మంత్రి పాపకు పాలు అందించేందుకు ఏర్పాటు చేయాలని రైల్వే సిబ్బందికి ఆదేశించారు. ట్వీట్‌ చేసిన సమయానికి అప్పటికే రైలు భీమ్‌సేన్‌ స్టేషన్‌ నుంచి బయలుదేరింది. ట్వీట్‌ చేసిన 23 నిమిషాల కాన్పూర్‌ సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌లోని 9వ నంబర్ ఫ్లాట్‌ఫాంపైకి రైలు 15.15 గంటలకు చేరిన వెంటనే అప్పటికే పాలు పట్టుకుని ఎదురు చూస్తునన రైల్వే సిబ్బంది తల్లికి పాలు అందించారు. కాన్పూర్‌ డిప్యూటీ సీఎం హిమాన్షు శేఖర్‌ ఉపాధ్యాయ ఆదేశాల మేరకు సంతోష్ త్రిపాఠి చిన్నారికి పాలు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. తన ట్వీట్ కు వెంటనే స్పందించి తన బిడ్డ ఆకలి తీర్చిన రైల్వేశాఖకు అంజలి కృత్ఞతలు తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement