Saturday, May 21, 2022

నేడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో కేటీఆర్ పర్యటన

మంత్రి కేటీఆర్‌ నేడు మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాల్లో పర్యటించున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. మహబూబ్‌నగర్‌లో ఉద్యోగార్థులకు పోటీపరీక్షల పుస్తకాలను అందజేస్తారు. అనంతరం నారాయణపే జిల్లాలో రూ.81.94 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేయనున్నారు. టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యంలో నారాయణపేటలో నిర్మించనున్న గోల్డ్‌ సోక్‌ మార్కెట్‌కు భూమి పూజ చేడయంతోపాటు ప్రజల దాహార్తిని తీర్చే దుకు రూ.29.59 కోట్లతో నిర్మించిన మిషన్‌ భగీరథ పంప్‌ హౌస్‌ను ప్రారంభింస్తారు. కొండారెడ్డిపల్లి మినీ ట్యాంక్‌ బండ్‌ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభలో మంత్రి కేటీఆర్‌ ప్రసంగిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement