Sunday, April 28, 2024

Nursingi : ఓఆర్‌ఆర్‌ ఇంటర్‌ చేంజ్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ నగరానికి సమీపంలోని ఔటర్‌ రింగు రోడ్డుపై కొత్తగా మరో ఇంటర్‌ చేంజ్‌ అందుబాటులోకి వచ్చింది. నార్సింగి వద్ద రూ.29.50 కోట్లతో నిర్మించిన ఓఆర్‌ఆర్‌ ఇంటర్‌ చేంజ్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. గ్రేటర్‌ చుట్టూ 158 కి.మీ మేర ఉన్న ఔటర్‌ రింగు రోడ్డుపై ఇప్పటి వరకు 19 ఇంటర్‌ చేంజ్‌లు ఉన్నాయి. నార్సింగి, కోకాపేట నియోపొలీస్‌, మల్లంపేట ప్రాంతాల్లో కొత్తగా మరో మూడింటిని హెచ్‌ఎండీఏ నిర్మాణం చేపట్టింది. ఇందులో నార్సింగి ఇంటర్‌ చేంజ్‌ పనులు పూర్తికావడంతో ట్రాఫిక్‌ను అనుమతించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement