Thursday, May 2, 2024

చిన్న వాటికి ఆశ‌ప‌డ‌కండి: హజురాబాద్ ఓటర్లకు హరీష్ పిలుపు

హుజురాబాద్ ఉపఎన్నికలో ప‌క్క పార్టీలు ఆశ చూపే కుంకుమ భ‌ర‌ణి, గ‌డియారాల‌కు జ‌ర ఆగం కావొద్దు మంత్రి హరీష్ రావు కోరారు. అవి తిండి పెట్ట‌వు అని అన్నారు. హుజూరాబాద్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన స‌భ‌లో హ‌రీష్ రావు పాల్గొని ప్ర‌సంగించారు. గ‌డియారాలు, కుంకుమ భ‌ర‌ణిల‌కు మోసపోవ‌ద్దని, అందులో మ‌ర్మ‌మేందో గ్ర‌హించాలన్నారు. చిన్న‌చిన్న వాటికి ఆశ‌ప‌డ‌కండి. ఎండ‌మావుల వెనుక ప‌రుగెత్తితే మ‌నకు ఏం రాదు అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

సిద్ధిపేటలో తాను ఇళ్లన్నీ పూర్తి చేయించానని.. ఈటల తన నియోజకవర్గంపై దృష్టి పెట్టలేదని మంత్రి హరీష్‌ రావు విమర్శించారు. హుజూరాబాద్‌కు సీఎం కేసీఆర్.. నాలుగు వేల ఇళ్లు మంజూరు చేశారన్న ఆయన.. ఈటల ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయలేదని ఆరోపించారు. బీజేపీ రెండు వేల పింఛన్లు ఎక్కడ ఇస్తుందో చెప్పాలన్నారు. గతంలో ఎమ్మెల్యేలు అంతా కలిసి మహిళా భవనం కట్టించారని చెబుతున్నారని.. అలా అయితే హుజూరాబాద్‌లో ఎందుకు కట్టలేదని హరీష్ ప్రశ్నించారు. కల్యాణ లక్ష్మి, రైతు బంధు పథకాలు దండగ అని ఈటల రాజేందర్ అన్నారని గుర్తు చేశారు. వ్యక్తి ఆత్మగౌరవాన్ని.. ప్రజల ఆత్మ గౌరవంతో ముడిపెడితే కుదరదని పేర్కొన్నారు. ప‌ని చేసే ప్ర‌భుత్వాన్ని కాపాడుకోవాలన్న మంత్రి హరీష్.. ‘’ప‌ని చేయించుకునే హ‌క్కు మీది.. చేసే బాధ్య‌త‌ మాది. మీ ఆశీర్వాదం త‌ప్ప‌కుండా ఉండాలి’’ అని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: దమ్ముంటే చర్చకు రా.. హరీష్ రావుకు ఈటల సవాల్
Advertisement

తాజా వార్తలు

Advertisement