Thursday, April 25, 2024

దేశంలో ఉపఎన్నికల నిర్వహణపై సీఈసీ ట్విస్ట్

దేశంలో ఉపఎన్నికల నిర్వాహణపై కేంద్ర ఎన్నికల సంఘం పెద్ద ట్విస్ట్‌ ఇచ్చింది. ఉప ఎన్నికల నిర్వహణపై దేశంలోని అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను సీఈసీ అడిగింది. ఈ మేరకు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు లేఖ రాసింది. దేశంలో ఎన్నికల నిర్వహణ పై ఇప్పటికే కోవిడ్ మార్గదర్శకాలు, నిబంధనలను విడుదల చేస్తామన్న ఎన్నికల కమిషన్.. ఐదు రాష్ట్రాలతో పాటు పలుచోట్ల ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో మార్గదర్శకాలు, నిబంధనలపై అభిప్రాయాలు తెలియజేయాలని జాతీయ, ప్రాంతీయ పార్టీలను ఈ లేఖలో కోరింది.

అన్ని రాజకీయ పార్టీలు ఆగస్టు 30 లోగా అభిప్రాయాలు తెలియజేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ కోరింది. ఇక ఈ లేఖతో తెలంగాణ హుజురాబాద్ ఉపఎన్నికకు సిద్ధమవుతున్న అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ పార్టీలకు షాక్ తగిలింది. కేంద్ర ఎన్నికల సంఘం లేఖ ప్రకారం ఈ ఆగస్టులోనూ హుజురాబాద్‌ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ రాదని సమాచారం. హుజురాబాద్‌ ఉప ఎన్నికకు మరో నెల సమయం పట్టే అవకాశం ఉంది. ఉప ఎన్నిక మరింత ఆలస్యం అయితే.. ఇప్పటికే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటెలకు నిరాశ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఈ వార్త కూడా చదవండి: హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ?

Advertisement

తాజా వార్తలు

Advertisement