Wednesday, May 22, 2024

అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందిప‌డుతోన్న మైక్ టైస‌న్ -ప్ర‌స్తుతం బాగానే ఉన్నా

అనారోగ్యంతో ఇబ్బంది ప‌డుతున్నారు ప్ర‌పంచ హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్. రీసెంట్ గా హీరో విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ‘లైగర్’ సినిమాలో మైక్ టైసన్ నటించిన సంగతి తెలిసిందే.అయితే ఇటీవల మియామి విమానాశ్రయంలో చక్రాల కుర్చీలో కనపడటంతో అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే, సయాటికా అనే సమస్యతో బాధపడుతున్నానని టైసన్ చెప్పారు. ఈ సమస్య కారణంగా వెన్ను కింది భాగం, పిరుదులు, కాళ్లలో తీవ్రమైన నొప్పి వస్తుంటుందని… నొప్పి మరింత ఎక్కువైనప్పుడు కనీసం మాట్లాడలేనని అన్నారు. అయితే, ప్రస్తుతం పరిస్థితి మెరుగ్గానే ఉందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement