Sunday, May 5, 2024

రెసిడెన్షియ‌ల్ బిల్డింగ్ లో భారీ పేలుడు-ఎనిమిది మందికి గాయాలు-ముగ్గురి ప‌రిస్థితి విష‌మం

రెసిడెన్షియ‌ల్ బిల్డింగ్ లో భారీ పేలుడు సంభ‌వించింది.ఈ ప్ర‌మాదంలో ఎనిమిది మంది గాయ‌ప‌డ్డారు. ముగ్గురి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. అమెరికాలోని చికాగోలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.న‌గ‌రంలోని సౌత్ ఆస్టిన్ ప్రాంతంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. అయితే నివాస ప్రాంతంలో ఏ కార‌ణం చేత పేలుడు జ‌రిగిందో ఇంకా స్ప‌ష్టంగా తెలియ‌దు. ఆరుగురు పురుషులు, ఇద్ద‌రు మ‌హిళ‌ల్ని ఆస్ప‌త్రికి తీసుకువెళ్లారు. బిల్డింగ్ పేలిన‌ ప్ర‌దేశం స‌మీపంలో ఉన్న బిల్డింగ్ నుంచి జ‌నాల్ని ఖాళీ చేయించారు. బిల్డింగ్‌లోని ఫోర్త్ ఫ్లోర్ పూర్తిగా కూలిపోయింది. పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement