Thursday, May 2, 2024

TecH: బ్యాడ్​ న్యూస్, ఇకపై ఆ కంప్యూటర్లు పనిచేయవు.. ఎందుకో తెలుసా?

కంప్యూటర్లు, ల్యాప్​టాప్​లు వాడుతున్న వారికి ఏకైక ఆపరేటింగ్​ సిస్టమ్​ మైక్రోసాఫ్ట్​ విండోస్​. అయితే ఈ కంపెనీ కొంతకాలంగా తన వెర్షన్స్​ని అప్​డేట్స్​ చేస్తూ వస్తోంది. ఈ మధ్య కాలంలో విండోస్​ 11 బీటా వెర్షన్​ టెస్ట్​ చేసి ఆ తర్వాత ఫుల్​ వెర్షన్​ కూడా రిలీజ్​ చేసింది. అయితే.. ఇప్పటిదాకా ఉన్న చాలా పీసీలు, ల్యాప్​టాప్​లలో ఈ వెర్షన్​ వర్క్​ చేయదు. ఎందుకంటే వాటి హార్డ్​వేర్​ విండోస్​ 11కి సపోర్ట్​ చేయకపోవడమే దీనికి ప్రధాన కారణం.

ఇక.. విండోస్​ ఇప్పటిదాకా పాత వెర్షన్స్​తోనే పని నెట్టుకొస్తున్న వారికి కూడా చెక్​ పెట్టబోతోంది. విండోస్​ ఆపరేటింగ్​ సాఫ్ట్​వేర్​ కొనుగోలు చేయకుండా క్రాక్​ వెర్షన్​ వాడుతూ.. సాఫ్ట్​వేర్​ చౌర్యానికి పాల్పడే వారి పీసీలు, ల్యాప్​టాప్​లు పనిచేయకుండా పోయే ప్రమాదం ఉంది. అందుకని మైక్రోసాఫ్ట్​ ముందస్తు హెచ్చరికలు జారీ చేసి, ఆ తర్వాత పూర్తిగా పాత వెర్షన్స్​ని పనిచేయకుండా చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగానే ఇప్పటిదాకా వాడుతున్న విండోస్​ 8.1 వెర్షన్​ని వచ్చే జనవరి వరకు మాత్రమే పరిమితం చేసి, ఆ తర్వాత దాన్ని ఆపేయనున్నట్టు తాజా ప్రకటనలో వెల్లడించింది.

కంప్యూటర్​, ల్యాప్​టాప్​ వాడుతున్న వారికి ఇది బ్యాడ్​ న్యూస్​ అనే చెప్పవచ్చు. ఎందుకంటే మైక్రోసాఫ్ట్​ విండోస్​ ఆపరేటింగ్​ సిస్టమ్​ తప్ప.. మరేది వినియోగించలేని పరిస్థితి ఉంటుంది. ఆపిల్​, ఒబుంటూ వంటి ఆపరేటింగ్​ సిస్టమ్స్​ ఉన్నా వాటిని మన అవసరాలకు తగ్గట్టు వాడుకోలేము. ఎందుకంటే కంప్యూటర్​ నేర్చుకునే ప్రతి ఒక్కరూ ఈ సిస్టమ్​కి అలవాటు పడి ఉండడమే ముఖ్య కారణం. ఒబుంటూ వంటి ఆపరేటింగ్​ సిస్టమ్​ అయితే.. సామాన్య ప్రజలకు అస్సలు ఉపయోగపడుదు. ఎందుకంటే అది కేవలం పెద్ద పెద్ద కంపెనీలకు ఉపయోగపడేలా దాని థీమ్​, వర్క్​ స్టైల్​ ఉంటుంది.. ఇక ఆపిల్​ ఓఎస్​ వాడాలన్నా చాలా ఖర్చుతో కూడుకున్న పని. అంతేకాకుండా అందరూ జనరల్​గా వాడే కొన్ని సాఫ్ట్​వేర్స్​ దీంట్లో రన్​ చేయలేము. తెలుగులో టైపింగ్​ చేయడం, కొన్ని రకాల టూల్స్​ని వినియోగించడం అంత ఈజీ కాదు.

అయితే.. Microsoft కంపెనీ త్వరలోనే Windows 8.1 వినియోగిస్తున్న వారికి సపోర్టింగ్​ ఫైల్స్​ ఆపేస్తున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించిన మాల్​వేర్​ ప్రొటెక్టివ్​ సాఫ్ట్​వేర్​ కానీ, ఆపరేటింగ్​ సిస్టమ్​ను ఎవరూ హ్యాక్​ చేయకుండా సురక్షితంగా ఉండేలా కావల్సిన సాఫ్ట్​వేర్​ కానీ ఇకమీదట రిలీజ్​ చేయబోమని తెలిపింది.

ఇప్పటి వరకు మైక్రోసాఫ్ట్​ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్న వారికి కావాల్సిన సపోర్టింగ్​ ఫైల్స్​ని వచ్చే ఏడాది జనవరి 10వ తేదీ వరకు మాత్రమే అందించనున్నట్టు తెలిపింది. విండోస్​ ఆపేరింట్​ ఎక్స్​పైరీ తేదీ కూడా 2023 జనవరి 10వ తేదీతో ముగుస్తుందని కంపెనీ ప్రకటించింది. ఇక.. వచ్చే నెల నుండి జులై నుంచి దీనికి సంబంధించిన  హెచ్చరికలు కంప్యూటర్​ వాడుతున్న వారికి అందుతాయని తెలిపింది. దీని అర్థం పేర్కొన్న తేదీ తర్వాత, Windows 8.1 వినియోగదారులు ఇకపై భద్రతా అప్​డేట్స్​ని పొందలేరు. ఆపరేటింగ్ సిస్టమ్‌ను సురక్షితంగా ఉపయోగించడం కోసం వారు కొత్త Windows అప్​డేట్స్​ని అందుకోలేరని కంపెనీ తెలిపింది.

- Advertisement -

Microsoft తన లేటెస్ట్​ లైఫ్‌సైకిల్ పాలసీకి కట్టుబడి ఉన్నందున Microsoft 365 Windows 8.1 PCలకు జనవరి 10 తర్వాత ఎట్లాంటి సపోర్టు ఇవ్వదు. ఇది వినియోగదారులను కొత్త సురక్షితమైన సాఫ్ట్ వేర్‌తో అప్​డేట్​ కావడానికి ప్రోత్సహిస్తోంది.  మైక్రోసాఫ్ట్ తన వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించి తరచుగా ఎదురయ్యే ప్రశ్నల జాబితాను కూడా విడుదల చేసింది.

Windows 8.1 జనవరి 2023 తర్వాత పని చేయడం కొనసాగుతుంది. కానీ, ఎలాంటి భద్రతా అప్‌డేట్‌లు రాబోవవని కంపెనీ ప్రకటించింది. మీ PC దెబ్బతినకుండా ఉండేందుకుఒక్క అవకాశం మాత్రమే ఉందని, Windows 8.1 వినియోగదారులు ఇప్పుడు వారి OSని అప్‌గ్రేడ్ చేయడానికి లేదా సరికొత్త PCని కొనుగోలు చేయడానికి రెడీగా ఉండాలని తెలిపింది. ఎందుకంటే Windows 8.1 PCలు లేటెస్ట్​ వర్షన్​ అయిన Windows 11కి సపోర్ట్​ చేయలేవు. ఎందుకంటే వాటి హార్డ్ వేర్ విండోస్​ 11కి కావాల్సినంతగా ఉపయోగకరంగా ఉండదు అని Microsoft చెప్పింది.

చాలా మంది Windows 8.1 లేదా Windows 8 ఆపరేటింగ్​ సిస్టమ్​పై వర్క్​ చేస్తుంటారు. వారికి Windows 11కి అప్‌గ్రేడ్ చేయడానికి కావాల్సిన హార్డ్ వేర్ సపోర్ట్​ చేయదు. దీనికి ప్రత్యామ్నాయంగా Windows 8 మరియు 8.1 ఆపరేటింగ్​ సిస్టమ్స్​ వాడుతున్న వారు.. విండోస్​ సాఫ్ట్ వేర్ పూర్తి వెర్షన్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.. దీంతో Windows 10కి అప్‌గ్రేడ్ అవుతారు” అని Microsoft చెప్పింది. ఇట్లా కొనుగోలు చేసిన విండోస్​ ఆపరేటింగ్​ సిస్టమ్స్​కు 2025 అక్టోబర్ 14వ తేదీ వరకు తమ సపోర్టింగ్​ సాఫ్ట్​వేర్స్​ అందించనున్నట్టు కంపెనీ ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement