Sunday, April 28, 2024

ఇక ‘ఈఎంఐ’ లోనూ మామిడికాయాలు కొన‌చ్చు…

మామిడిపండ్ల సీజన్ మొదలైంది.. నోరూరించే రకరకాల మామిడిపండ్లు ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వస్తున్నాయి. డిమాండ్ ఎక్కువగా ఉండడం, దానికి తగ్గట్లుగా సప్లై లేకపోవడంతో ధరలు విపరీతంగా ఉన్నాయి. అల్ఫాన్సా రకం పండ్ల రేటు మరీ ఎక్కువ. ప్రస్తుతం ఈ మామిడిపండ్ల ఖరీదు డజనుకు రూ.800 నుంచి రూ.1300 గా ఉంది.. ఇంత ధ‌ర చెల్లించి కొనుగోలు చేయ‌లేని వారి కోసం మహారాష్ట్రలోని ఓ వ్యాపారి సరికొత్త ఆఫర్ తో ముందుకొచ్చాడు. ముందు తినండి.. ఆ తర్వాతే డబ్బులివ్వండంటూ ఈఎంఐ పద్ధతిలో పండ్లు అమ్ముతున్నాడు. తమ దుకాణంలో రూ.5 వేలకు పైగా విలువైన పండ్లు కొంటే క్రెడిట్ కార్డుతో ఈఎంఐ పద్ధతిలో చెల్లించవచ్చని అంటున్నాడు పుణెలోని గురుకృప ట్రేడర్స్ అండ్ ఫ్రూట్ ప్రొడక్ట్స్ దుకాణం యజమాని గౌరవ్ సనాస్.. ఈ పండ్లు తినాలనే కోరిక ఎంత ఉన్నప్పటికీ ఇంత మొత్తం ఒకేసారి చెల్లించలేని వారు ఈఎంఐ పద్ధతిలో కొనుగోలు చేయొచ్చని గౌరవ్ చెప్పారు. ఇప్పటి వరకు ఈఎంఐ పద్ధతిలో ఐదుగురు కస్టమర్లు మామిడిపండ్లను కొనుగోలు చేశారని గౌరవ్ చెప్పారు. ఇప్పుడిప్పుడే ఈఎంఐ ప‌ద్ద‌తిలో కొనుగోలు చేసేందుకు పండ్ల ప్రియులు ఆస‌క్తి చూపుతున్నారంటూ వెల్ల‌డించాడు గౌర‌వ్.

Advertisement

తాజా వార్తలు

Advertisement