Thursday, May 2, 2024

అల్ల‌రి న‌రేష్ ఉగ్రం నుంచి వెస్ట్ర‌న్ సాంగ్ – వీడియోతో

‘అల్లరి’ నరేశ్ కామెడీ ట్రాక్ వదిలి.. ‘నాంది’, ‘ఇట్లు మారేడు నియోజకవర్గం’ వంటి సీరియస్ సినిమాలు చేశాడు. తాజాగా ‘ఉగ్రం’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.. మే 5న విడుద‌ల కానున్న మూవీకి ప్ర‌చారాన్ని స్టార్ట్స్ చేశారు నిర్మాత‌లు.. ఇప్ప‌టికే టీజ‌ర్ తో అంద‌ర్ని త‌న‌వైపు తిప్పుకున్న న‌రేష్ ఇప్పుడు ‘అల్బేలా.. అల్బేలా.. హల్ చల్ చేద్దాం క్రేజీగా..’ అంటూ సాగే వీడియో సాంగ్‌తో ముందుకు వ‌చ్చాడు.


భాస్క‌ర‌భ‌ట్ట రాసిన ఈ గీతాన్ని శ్రావ‌ణ భార్గ‌వి, రేవంత్ లు ఆల‌పించారు. శ్రీచరణ్ పాకల ఇచ్చిన ట్యూన్ ఫ్రెష్ గా ఉంది. పాటను విదేశీ లొకేషన్లలో బ్యూటిఫుల్ గా విజువలైజ్ చేశారు. మధ్యలో వచ్చే చిన్నారి స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. నాంది సినిమాకు దర్శకత్వం వహించిన విజయ్‌ కనకమేడల.. ‘ఉగ్రం’ను కూడా తెరకెక్కిస్తున్నాడు. మిర్నా మేనన్‌ కథానాయిక. ఈ సాంగ్ ను మీరూ తిలకించండి..

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement