Monday, April 29, 2024

Flash: జమ్మికుంటలో చిట్ ఫండ్ మోసం.. మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య

కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో చిట్ ఫండ్ మోసం వెలుగులోకి వచ్చింది. కట్టిన చిట్టి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మనస్థాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. పోతరాజు సతీష్ అనే వ్యక్తి అచల చిట్ ఫండ్ లో చిట్టి పూర్తిగా డబ్బులు కట్టిన తనకు రావాల్సిన రూ. 7 లక్షల రూపాయాలి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయడంతో మనస్థాపం చెంది ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నడు. అచల చిట్ ఫండ్ లో చిట్టీలు వేసిన సతీష్.. చిట్టీ డబ్బులు ఇవ్వలేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. బ్రాండ్ మేనేజర్ సత్యనారాయణ వల్లే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సూడైడ్ నోటో లో పేర్కొన్నాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హన్మకొండలోని ఆచల చిట్ ఫండ్ లో 6 లక్షల రూపాయలు ఫిక్స్ డ్ డిపాజిట్ చేసి ఒక లక్ష రూపాయల చిట్ పూర్తిగా పేమెంట్ చేసిన ఆచాల చిట్ ఫండ్ బ్రాంచ్ మేనేజర్ పంచగిరి సత్యనారాయణ అనే వ్యక్తి డబ్బులు ఇవ్వకుండా 14 నెలలుగా తిప్పకుని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. దీంతో మానసికంగా మనోవేదనకు గురయిన పోతరాజు సతీష్.. తన డబ్బులు ఇక రావని మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేను సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు సతీష్ రాసిన సూసైడ్ నోట్ ను పోలీస్ లు స్వాదినం చేసుకున్నారు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామ్మోహన్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement