Wednesday, May 1, 2024

Big Breaking | పోలీసులకు 30 ఏళ్ల నుంచి దొరుకుతలేడు​.. సిరిసిల్లలో పట్టుకున్న సీఐడీ టీమ్​

30 ఏళ్ల నుంచి పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న ఓ నిందితుడిని ఇవ్వాల (శనివారం) తెలంగాణ పోలీసులు పట్టుకున్నారు. ఇంతకాలం పరారీలో ఉన్న వ్యక్తిని తెలంగాణ నేర పరిశోధన విభాగం (సీఐడీ) పట్టుకుని అరెస్ట్ చేసింది. చీటి ఎల్లయ్య 1989లో అప్పటి కరీంనగర్ జిల్లా పరిధిలోని సిరిసిల్ల పోలీస్ స్టేషన్‌లో దొంగతనానికి పాల్పడినట్లు కేసు నమోదు అయ్యింది. అప్పటి నుంచి ఎల్లయ్య పరారీలో ఉన్నాడు.

అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్లు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. సీనియర్​ ఐపీఎస్​ ఆఫీసర్, అడిషనల్​ డీజీపీ (సీఐడీ)​ మహేశ్‌ ఎం. భగవత్‌ ఆదేశాల మేరకు.. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎ. శ్రీనాథ్‌ నేతృత్వంలోని తెలంగాణ ప్రత్యేక బృందాలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించి నిందితుడిని కనిపెట్టాయి. ఇవ్వాల కొద్దిసేపటి క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఓ అగ్రహారం నుంచి ఎల్లయ్యను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement