Thursday, May 2, 2024

ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేయ‌డం కాదు – రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించండి – పొంగులేటి సుధాకర్ రెడ్డి

భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ పై, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు, తమిళనాడు రాష్ట్ర సహా ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి భాషా సంస్కారం లేకుండా, దేశ ప్రధానిని భారతదేశం నుండి తరిమికొడతామని అనడం హాస్యాస్పదంగా ఉందని, రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రిగా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీతో కలిసి ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రజల యొక్క దృష్టి మరల్చేందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు, ఇప్పటికైనా నిరుద్యోగ భృతిని వెంటనే విడుదల చేయాలని, అర్హులైన పేద వారందరికీ డబల్ బెడ్రూమ్ ఇల్లు వెంటనే మంజూరు చేయాలని, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలని, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, రేషన్ కార్డులు లేక అనేకమంది పేదలు ఇబ్బందులకు గురవుతున్నారని వారికి వెంటనే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని, వృద్ధులకు వితంతువులకు దివ్యాంగులకు వెంటనే నూతన పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

అభివృద్ధిని ప్రజాసంక్షేమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి పక్కనపెట్టి ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని అన్నారు, మోడీపై దేశ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ బిజెపి ప్రభుత్వం దేశంలోని పేద మహిళలందరికీ ఈ సంవత్సరం నూతనంగా కోటి మంది మహిళలకు ఉజ్వల పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతున్నారని, 80 లక్షల మంది నిరుపేదలకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు నిర్మించబోతున్నారు అని, దేశవ్యాప్తంగా ఫోర్ వే రోడ్ల నిర్మాణం చేస్తున్నారని, స్వచ్ఛభారత్ కింద మరుగుదొడ్లు నిర్మించి ఇస్తున్నారని, ఎస్సీ ఎస్టీ పేదలకు స్టార్ట్ అప్ ఇండియా స్టాండప్ ఇండియా పేరుతో పారిశ్రామికవేత్తలను చేస్తున్నారని, దేశ రక్షణ రంగానికి కోట్ల రూపాయలు వెచ్చించి మిలటరీకి అత్యాధునిక ఆయుధాలు సమకూర్చి దేశ రక్షణ పటిష్ట పరుస్తున్నారు అని, అన్నారు, అభివృద్ధి సంక్షేమ విషయంలో ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి కృషి ఎనలేనిదని, అటువంటి దేశ ప్రధాని పై అనుచిత వ్యాఖ్యలు చేయడం కంటే రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టడం మంచిదని కేసీఆర్ కి హితవు పలికారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement