Saturday, April 27, 2024

మ‌హేశ్ బాబుపై క్రికెట‌ర్ ‘హ‌నుమ విహారి’ ప్ర‌సంశ‌లు

హీరో నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ గా చేస్తోన్న అన్ స్టాప‌బుల్ షోకి హీరో మ‌హేశ్ బాబు గెస్ట్ గా వ‌చ్చారు. ఈ ఎపిసోడ్ ఫిబ్ర‌వ‌రి 4న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ షో ప్రోమోనే రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో మహేష్ బాబు ఆసక్తికర విషయాలను బాలయ్య తో పంచుకున్నారు. అన్నిదానాల కన్నా ప్రాణదానం గొప్పది.. వేయి మందికి పైగా చిన్నారులకు మహేష్ బాబు గుండె ఆపరేషన్స్ చ్చేయించార‌ని బాలయ్య కొనియాడారు. మహేష్ మాట్లాడుతూ.. తన కొడుకు గౌతమ్ ఆరువారాల ముందే పుట్టాడని.. పుట్టినప్పుడు తన చెయ్యి అంతే ఉన్నాడని అన్నారు మహేష్. ఇప్పుడు దాదాపు ఆరడుగులు ఉన్నాడు. మాకు డబ్బులున్నాయి కాబట్టి ఓకే.. లేనివాళ్లు పరిస్థితి ఏంటి అనిపించింది.

అప్పటినుంచి చిన్న పిల్లలకు సేవ చేస్తున్న అని మహేష్ తెలిపాడు.. దాంతో బాలయ్య, మహేష్ ను మెచ్చుకున్నారు. ఈ ప్రోమో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఈ ప్రోమో పై , మహేష్ సేవ పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా టీమిండియా క్రికెటర్ హనుమ విహారి ట్విట్టర్ ద్వారా మహేష్ కు హ్యాట్సాఫ్ చెప్పాడు. నిజంగా ఎంతో ఆదర్శవంతం.. వేయి మందికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించిన మహేష్ బాబు వావ్ అంటూ దండం పెట్టె ఎమోజి , చప్పట్లు కొట్టే ఎమోజితో రాసుకొచ్చాడు హనుమ విహారి. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement