Thursday, May 16, 2024

మ‌హేశ్ బాబు గ్రేట్ – ఒకే రోజు 30మంది చిన్నారుల‌కి గుండె ఆప‌రేష‌న్లు

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు గ్రేట్ అని కొనియాడుతున్నారు ఫ్యాన్స్. ఎందుకంటారా..ఒకే రోజు 30 మంది చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపారు. నిన్న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చిన్నారులందరికీ గుండె ఆపరేషన్లు చేయించారు. మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ఆంధ్రా ఆసుపత్రి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మహేశ్ ఉదారతపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎంబీ ఫౌండేషన్ పేరుతో మహేశ్‌బాబు ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎంతోమంది చిన్నారులకు ఈ ఫౌండేషన్ ద్వారా ఆపరేషన్లు చేయిస్తూ అండగా నిలుస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement