Thursday, May 16, 2024

ఆనాటి త‌ప్పుకి – ఇప్పుడు జైలు శిక్ష – మ‌హారాష్ట్ర మంత్రికి ఊహించ‌ని ట్విస్ట్

ఆయ‌న సాక్షాత్త్ మంత్రి. అయినా స‌రే కోర్టు ఆయ‌న‌కి రెండు నెల‌లు జైలు శిక్ష విధించ‌డ‌మే కాదు రూ.25 వేల జ‌రిమానా విధించింది. ఎందుకు అనుకుంటున్నారా..మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల అఫిడ‌విట్ లో ఆస్తుల వివ‌రాలు త‌ప్పుగా న‌మోదు చేసినందుకు. ..మ‌హారాష్ట్ర మంత్రి బ‌చ్చు క‌డూకి ఈ శిక్ష‌ని విధించింది కోర్టు. 2014 మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అఫిడ‌విట్‌లో ఆస్తుల వివ‌రాల‌ను త‌ప్పుగా న‌మోదు చేశారు.అయితే ఆ ఎన్నిక‌ల్లో బ‌చ్చు క‌డూ అచ‌ల్ పూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేశారు. విజ‌యం సాధించిన త‌రువాత ఆయ‌న మంత్రి ప‌ద‌వీ కూడా చేప‌ట్టారు.

పోటీ చేసిన స‌మ‌యంలో దాఖ‌లు చేసిన అఫిడ‌విట్‌లో ముంబైలో త‌న‌కు ఉన్న ఫ్లాట్ వివ‌రాల‌ను న‌మోదు చేయ‌లేదు. దీనిపై బీజేపీ కౌన్సిల‌ర్ గోపాల్ తిర‌మ‌రే కోర్టును ఆశ్ర‌యించారు. ఎప్ప‌టి నుంచో విచార‌ణ జ‌రుగుతుండ‌గా.. శుక్ర‌వారం విచార‌ణ ముగించింది కోర్టు. పాఠ‌శాల విద్యాశాఖ స‌హాయ మంత్రిగా ఉన్న బ‌చ్చు క‌డూను దోషిగా తేల్చి.. రెండు నెల‌ల కాలం పాటు జైలు శిక్ష‌, రూ.25వేలు జ‌రిమానా విధించింది. దీనిపై కోర్టుకు వెళ్లేందుకు స‌మ‌యం ఇవ్వాల‌ని, బెయిల్ మంజూరు చేయాలంటూ బ‌చ్చు క‌డూ పిటిష‌న్ దాఖ‌లు చేయ‌గా.. సానుకూలంగా స్పందించిన కోర్టు పై కోర్టులో అప్పిల్‌కు నెల రోజుల స‌మ‌యం ఇవ్వ‌డంతో పాటు బెయిల్ మంజూరు చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement