Friday, May 3, 2024

ఓటుకు నోటు తీసుకుంటే, ఎలుకల బోనులో చిక్కినట్టే.. తమిళనాడులో వింత ప్రచారం

తమిళనాడు రాష్ట్రంలో జరిగే మున్సిపల్​ ఎన్నికలకు నామినేషన్ వేసేందుకు ఓ యువకుడు వచ్చాడు. అయితే అతను తన ప్రచారానికి అనుసరించిన వ్యూహం సరికొత్తగా ఉందని జనాలు అంటున్నారు.  మదురైలో  నామినేషన్​ పత్రాలను దాఖలు చేయడానికి ఎలుకలను పట్టే బోను,  దానిపై రూ. 2,000 నోటుతో వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. మదురై 3వ వార్డు నుంచి పోటీ చేసేందుకు జాఫర్ షరీఫ్ నామినేషన్ దాఖలు చేశాడు. తమిళనాడులో ‘ఓటుకు నోట’ సమస్యపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎలుకల బోను, రెండు వేల రూపాయలను తీసుకొచ్చినట్లు ఆయన పేర్కొన్నాడు.

రాష్ట్రంలో నోటుకు ఓటు వంటి కాసుల దందా ఎక్కువైందని జాఫర్ అన్నాడు. ఓట్ల కోసం డబ్బులు తీసుకోవడమంటే ఐదేళ్లుగా ఉచ్చులో కూరుకుపోవడం లాంటిదని చెప్పాడు. “నేను నా వార్డును  మోడల్ ఆఫ్ క్లీన్‌లీనెస్ గా మార్చాలనుకుంటున్నా.  డబ్బు తీసుకున్న తర్వాత వారు ఎలా ట్రాప్‌లో చిక్కుకుంటారో తెలియజేయడానికి నేను ఈ ఎలుకల బోనుతో వచ్చాను.  నాకు మంచి ఉద్యోగం ఉంది.  నేను సంపాదించే డబ్బుతో  మంచి జీవితాన్ని గడపగలను. కానీ చదువుకున్న పౌరులు దేశానికి తిరిగి ఇవ్వాల్సిన సమయం వచ్చింది. అందుకే నేను పోటీ చేయాలని నిర్ణయించుకున్” అని జాఫర్ షరీఫ్ చెప్పాడు. తమిళనాడు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ నెల19న ఎన్నికలు జరగనుండగా..22న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement