Tuesday, May 7, 2024

మా బావ ‘రామ్ చరణ్’ కి అద్భుత‌మైన విజ‌యం – రాజ‌మౌళికి కృత‌జ్ఞ‌త‌లు – అల్లు అర్జున్

ఆర్ ఆర్ ఆర్ చిత్రంపై ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆర్ఆర్ఆర్ మూవీ విజయవంతం కావడానికి సహకరించిన మొత్తం టీం కి తన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. సినిమా చాలా అద్భుతంగా ఉందన్నారు. మా బావ రామ్ చరణ్ కి ఇంతటి అద్భుతమైన విజయాన్ని అందించిన దర్శకధీరుడు రాజమౌళి గారికి కృతజ్ఞతలు.రామ్ చరణ్ ని తన సోషల్ మీడియా ద్వారా ట్యాగ్ చేస్తూ బెస్ట్ ఫర్ ఫార్మర్ గా అభివర్ణించారు.రాజమౌళి గారిని కూడా ట్యాగ్ చేసి తన అభిమానాన్ని వ్యక్తం చేసారు. అయితే భీమ్లానాయక్ సినిమా మీద స్పందించకుండా ఆర్ ఆర్ ఆర్ పై స్పందించినందుకు పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియా వేదికగా పవర్ హౌస్ అని మెగా కుటుంబాన్ని అల్లు అర్జున్ పొగిడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement