Thursday, May 2, 2024

ఢిల్లీలో మరోసారి లాక్ డౌన్?

కోవిడ్ సెకండ్ వేవ్ మరోసారి లాక్ డౌన్ విధించేదాకా తగ్గెట్లు లేదు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు చూస్తుంటే పరిస్థితి చేయి జారిపోతున్నట్లుంది. నవంబర్ నుంచి కోవిడ్ కేసులు తగ్గుతున్నప్పటికి.. గత నెల రోజులుగా మళ్లీ కేసులు సంఖ్య రోజు రోజుకు పెరుగుతూవస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా కేసుల పెరుగుదల అత్యధికంగా ఉంది. దీంతో మహారాష్ట్రలో పలు చోట్ల లాక్ డౌన్ ని అమలు చేస్తోంది అక్కడి ప్రభుత్వం.  తాజాగా ఢిల్లీలో కూడా లాక్ డౌన్ విధించేందుకు సిద్దమయింది కేజ్రీవాల్ ప్రభుత్వం. మహారాష్ట్ర తరువాత ఢిల్లీలోనే కరోనా కేసుల సంఖ్య పెరుగుదల ఎక్కువగా ఉంది. వారం రోజుల వ్యవధిలోనే 4,288 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. పెరుగుతున్న కేసులపై విపత్తు నిర్వహణ అథారిటీ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తొంది. ఏకంగా రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించేందుకు కేజ్రీవాల్‌ ప్రభుత్వం సిద్ధమయ్యింది. త్వరలో రానున్న హోలీ పండగ నేపథ్యంలో లాక్‌డౌన్ నిర్ణయం తీసుకునే అవకాశాలు‌ కనిపిస్తున్నాయి. ఈనెల 28న హోలీ ఉండటంతో.. కఠిన ఆంక్షలకు విధించాలని సర్కార్ సిద్ధమైంది. ఈ క్రమంలో మార్చి 28 నుంచి 30 వరకు లాక్‌డౌన్‌ విధించాలని సూచించారు అధికారులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement