Friday, April 19, 2024

దేశంలోనే ఉత్తమ డీజీపీగా ఏపీ డీజీపీ

ఏపీ పోలీస్ విభాగం దేశవ్యాప్తంగా తమ సత్తా చాటింది. అత్యుత్తమ స్థాయిలో ప్రజలకు సేవలు అందిస్తున్నందుకు దేశవ్యాప్తంగా 13 అవార్డులు ఏపీ పోలీస్ విభాగానికి వచ్చాయి. ఈ నేపథ్యంలో దేశంలోనే ఉత్తమ డీజీపీగా ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఎంపికయ్యారు. ఈ మేరకు సీఎం జగన్‌ను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిసిన డీజీపీ తన సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా గౌతమ్ సవాంగ్‌ను ఏపీ సీఎం జగన్ అభినందించారు. జాతీయ స్థాయిలో ఏపీ పోలీస్ విభాగాన్ని అగ్రస్థానంలో నిలిపినందుకు సవాంగ్‌ను కొనియాడారు. స్మార్ట్ విధానాలతో ఇతర రాష్ట్రాల పోలీసులకు ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. కాగా సీఎం జగన్ అభినందనల పట్ల డీజీపీ సవాంగ్ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement