Monday, April 12, 2021

తెలంగాణలో లాక్‌డౌన్.. ఎక్కడంటే?

తెలంగాణలో సెకండ్ వేవ్ కారణంగా కరోనా పాజిటివ్ కేసులు విజృంభిస్తున్నాయి. శనివారం వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదు కాగా వరుసగా రెండో రోజు కూడా ఆదివారం నాడు 1,321 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఈ నేపథ్యంలో కరోనా ఉగ్రరూపం దాల్చడంతో జగిత్యాల జిల్లాలోని ఓ గ్రామంలో అధికారులు లాక్‌డౌన్ విధించారు. మల్లాపూర్ మండలం సిరిపూర్ గ్రామంలో 27 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో గ్రామంలో లాక్‌డౌన్ విధిస్తున్నట్లు పంచాయతీ అధికారులు తీర్మానించారు. ఈ నెల 15 వరకు అన్ని దుకాణాలు మూసి ఉంచాలని ఆదేశించారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు కిరాణా షాపులు తెరవాలని నిర్ణయించారు. గ్రామంలోని ప్రజలు మాస్కు ధరించకుంటే రూ.1,000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

అటు ఏపీలోనూ కరోనా కేసుల విజృంభణ కారణంగా రెండు రోజుల క్రితం గుంటూరు జిల్లాలోని భట్టిప్రోలు మండలంలో లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Prabha News